02 July 2024
TV9 Telugu
Pic credit - pexels
మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మెంతులు నానబెట్టిన నీరు తాగడం వలన ఆరోగ్యప్రయోజనాలున్నాయి. పొట్ట శరీరాన్ని చల్లబరస్తూ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
మెంతి గింజలలో నానబెట్టిన నీరు వర్షాకాలంలో చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అంతే కాదు మెంతి గింజలతో రకరకాల రుచికరమైన వంటకాలు కూడా చేస్తారు.
మెంతి గింజల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. అదనంగా, ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, ఐరెన్ వంటి పోషకాలు ఉన్నాయి.
మెంతి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి కానీ ఎక్కువగా తీసుకోకూడదు. అతిగా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు.
కొందరికి మెంతి గింజలను తినడం వలన అలర్జీ రావచ్చు. అందువల్ల మెంతులను తినే ముందు ఏదైనా అలెర్జీ సమస్యలుంటే వీటిని తీసుకోవద్దు.
ఎవరికైనా తక్కువ రక్తపోటు ఉన్నట్లయితే మెంతులు తినవద్దు. అధిక రక్తపోటు ఉన్న రోగులు రక్తపోటును తగ్గించడానికి మందులతో పాటు దీనిని కూడా తీసుకోవచ్చు.
జీర్ణశక్తి బలహీనంగా ఉంటే మెంతి గింజలు తినకూడదు. వీటిని తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం సమస్య పెరుగుతుంది.
గర్భధారణ సమయంలో మెంతి గింజలు తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వస్తాయి. కనుక గర్భిణీ స్త్రీలు మెంతి గింజలను తినకూడదు.