Telugu News Lifestyle Food Refreshing Sugarcane Juice Ice Cream Recipe: A Natural and Delicious Summer Treat to Beat the Heat!
సమ్మర్ హీట్ నుంచి ఉపశమనానికి అదిరిపోయే రీఫ్రెష్మెంట్.. చెరుకురసం, ఐస్‌క్రీమ్ కాంబో తిన్నారా!
చెరుకురసం అంటేనే వేసవిలో ఒక అమృతం. తక్షణ శక్తిని ఇవ్వడంలో దీనికి సాటి లేదు. అదే రసంతో ఐస్‌క్రీమ్ చేస్తే.. ఆ చల్లదనం, తీపిదనం కలిపి ఇచ్చే కిక్కే వేరు. బయట దొరికే ఐస్‌క్రీమ్స్ లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, కానీ మనం ఇంట్లో చేసుకునే ఈ వెరైటీ ఐస్‌క్రీమ్ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. బయట అడుగుపెడితే చాలు, భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. ఈ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి మనం రకరకాల శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లను ఆశ్రయిస్తుంటాం. అయితే, ఎప్పుడూ తినే వెనిలా, చాక్లెట్ ఫ్లేవర్లు బోర్ కొట్టాయా? అయితే ఈసారి కొత్తగా, స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధమైన ‘చెరుకురసం ఐస్‌క్రీమ్’ ప్రయత్నించండి. వినడానికే వింతగా ఉన్నా, దీని రుచి మాత్రం అద్భుతం. ఇంట్లోనే సహజంగా, ఎటువంటి కృత్రిమ రంగులు లేకుండా ఈ ఐస్‌క్రీమ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
తాజా చెరుకురసం: 2 కప్పులు (మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే వాడటం ఉత్తమం)
రసం సిద్ధం చేయడం : ముందుగా చెరుకురసాన్ని వడకట్టుకుని అందులో నిమ్మరసం, అల్లం రసం, చిటికెడు ఉప్పు కలపాలి. ఇది ఐస్‌క్రీమ్‌కు ఒక రకమైన ‘మసాలా చెరుకురసం’ ఫ్లేవర్‌ను ఇస్తుంది.
క్రీమ్ విప్పింగ్ : ఒక వెడల్పాటి గిన్నెలో చల్లని ఫ్రెష్ క్రీమ్ తీసుకుని, అది చిక్కగా, ప్లఫ్ఫీగా అయ్యే వరకు బ్లెండర్‌తో బాగా గిలకొట్టాలి.
మిక్సింగ్ : ఇప్పుడు అందులో కండెన్స్‌డ్ మిల్క్ వేసి మరోసారి కలిపాక, సిద్ధం చేసుకున్న చెరుకురసాన్ని కూడా పోసి ఎక్కడా ఉండలు లేకుండా సాఫ్ట్‌గా కలిపేయాలి.
ఫ్రీజింగ్ : ఈ మిశ్రమాన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లో పోసి, సుమారు 7 నుంచి 8 గంటల పాటు డీప్ ఫ్రీజర్‌లో ఉంచాలి. ఐస్‌క్రీమ్ పైన ఐస్ ముక్కలు పేరుకోకుండా ఉండటానికి బాక్స్ పైన అల్యూమినియం ఫాయిల్ పెట్టడం మంచిది.
బయట దొరికే ఐస్‌క్రీమ్స్‌లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇందులో చెరుకులోని సహజమైన తీపి ఉండటం వల్ల ఇది శరీరానికి తక్షణ గ్లూకోజ్‌ను అందిస్తుంది. ఎండలో తిరిగి వచ్చిన వారికి ఇది ఒక అద్భుతమైన ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తుంది. ఈ వేసవిలో మీ పిల్లలకు కొత్తగా ఏదైనా తినిపించాలనుకుంటే ఈ ‘చెరుకురసం ఐస్‌క్రీమ్’ బెస్ట్ ఆప్షన్. చల్లచల్లని ఈ స్వీట్ ట్రీట్‌తో ఎండ దెబ్బ నుంచి సేదదీరండి. పైన కొద్దిగా పుదీనా ఆకులు లేదా డ్రై ఫ్రూట్స్ చల్లి సర్వ్ చేస్తే ఆ మజానే వేరు!