Cheesy Maggi: పిల్లల కోసం ఎంత టేస్టీ చీజీ మ్యాగీ.. ఈజీగా చేసేయవచ్చు..

| Edited By: Shaik Madar Saheb

Sep 07, 2024 | 10:30 PM

మ్యాగీ అనగానే చాలా మందికి నోరూరిపోతుంది. మ్యాగీ అంటే కేవలం చిన్న పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా ఇష్టం. ఇష్టపడి మరీ లాగించేస్తారు. మ్యాగీతో చాలా రెసిపీలు చేయవచ్చు. రెస్టారెంట్లలో మ్యాగీతో చాలా స్పెషల్ రెసిపీలు చేస్తూ ఉంటారు. ఇవి చాలా రుచిగా ఉండటమే కాకుండా ఫాస్ట్‌గా చేసేయవచ్చు. మ్యాగీని ఎప్పుడైనా తినవచ్చు. ఇంత ఇష్టమైన చీజ్ వేస్తే ఆహా.. మరింత రుచిగా ఉంటుంది. అందులోనూ పిల్లలకు మరింత ఇష్టం. మరి ఇంత రుచిగా ఉండే చీజీ మ్యాగీని..

Cheesy Maggi: పిల్లల కోసం ఎంత టేస్టీ చీజీ మ్యాగీ.. ఈజీగా చేసేయవచ్చు..
Cheesy Maggi
Follow us on

మ్యాగీ అనగానే చాలా మందికి నోరూరిపోతుంది. మ్యాగీ అంటే కేవలం చిన్న పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా ఇష్టం. ఇష్టపడి మరీ లాగించేస్తారు. మ్యాగీతో చాలా రెసిపీలు చేయవచ్చు. రెస్టారెంట్లలో మ్యాగీతో చాలా స్పెషల్ రెసిపీలు చేస్తూ ఉంటారు. ఇవి చాలా రుచిగా ఉండటమే కాకుండా ఫాస్ట్‌గా చేసేయవచ్చు. మ్యాగీని ఎప్పుడైనా తినవచ్చు. ఇంత ఇష్టమైన చీజ్ వేస్తే ఆహా.. మరింత రుచిగా ఉంటుంది. అందులోనూ పిల్లలకు మరింత ఇష్టం. మరి ఇంత రుచిగా ఉండే చీజీ మ్యాగీని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చీజీ మ్యాగీకి కావాల్సిన పదార్థాలు:

చీజ్, మ్యాగీ నూడుల్స్, మ్యాగీ నూడుల్స్ మసాలా, ఉప్పు, కారం, క్యాప్సికమ్, ఉల్లిపాయ, పచ్చి మిర్చి ఆయిల్ లేదా బటర్.

ఇవి కూడా చదవండి

చీజీ మ్యాగీ తయారీ విధానం:

ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో కొద్దిగా బటర్ లేదా ఆయిల్ వేయండి. ఇది వేడెక్కాక పచ్చి మిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ కూడా వేసి ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం వేసి ఫ్రై చేసుకున్నాక.. సరిపడా వాటర్ వేయాలి. ఇప్పుడు మ్యాగీ వేసి దగ్గర పడ్డాక.. మ్యాగీ మసాలా, తరిగిన చీజ్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే చీజీ మ్యాగీ సిద్ధం. ఇది చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకు బాగా నచ్చుతుంది. చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.