చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. చికెన్‌తో చేసే ఏ వంట అయినా చాలా రుచిగా ఉంటాయి. ముఖ్యంగా స్నాక్స్ అయితే వేరే లెవల్ టేస్టీగా ఉంటాయని చెప్పొచ్చు. చికెన్‌తో చాలా రకాల స్నాక్స్, పచ్చళ్లు, వేపుళ్లు, కూరలు ఎన్ని అయినా చేసుకోవచ్చు. ఏం చేసినా చాలా బాగుంటాయి. అయితే చాలా ఐటెమ్స్ ఇంట్లో తయారు చేయలేం. దీంతో రెస్టారెంట్‌లకు వెళ్లి తింటూ ఉంటారు. ఇలా రెస్టారెంట్‌లో తినే ఐటెమ్‌లో చికెన్ ఫింగర్స్ కూడా ఒకటి. ఇవి క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంటాయి. వీటిని ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలి పెట్ట బుద్ధి కాదు. అందులోనూ ఇప్పుడు వర్షా కాలం. కాబట్టి వేడి వేడిగా, స్పైసీగా తినాలనిపిస్తూ ఉంటుంది. అన్నీ సిద్ధంగా ఉంటే కేవలం 20 నిమిషాల్లోనే ఈ రెసిపీ రెడీ అవుతుంది. మరి చికెన్ ఫింగర్స్ ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బోన్ లెస్ చికెన్, ఎగ్స్, బ్రెడ్, వెల్లుల్లి, ఉల్లిపాయ పొడి, మిరియాల పొడి, ఎండు మిర్చి, నిమ్మరసం, ఆయిల్.
ముందుగా చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ముక్కల్ని సన్నగా, పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను ఇప్పుడు కనీసం అరగంట సేపు అయినా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్‌ని ముక్కలుగా చేసి మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఎండు మిర్చి, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ పొడి కూడా వేసి ఒకసారి కలపండి. ఉల్లిపాయ పొడి లేకపోతే.. ఉల్లిపాయల్ని మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. నెక్ట్స్ ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి.
ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని తీసుకుని బ్రెడ్‌లో రూల్ చేయాలి. ఆ తర్వాత కోడి గుడ్డు మిశ్రమంలో ముంచి ఆయిల్‌లో వేసి వేడి చేసుకోవాలి. అన్ని వైపులాగా మీడియం మంటలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్‌లోకి రాగానే తీసేసి.. టిష్యూ పేపర్‌లో వేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫింగర్స్ సిద్ధం. దీన్ని మయోనీస్ లేదా టమాటా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.