ప్రోటీన్ అంతులేనంత దొరికే పవర్‌ఫుల్‌ లడ్డు!.. పంచదార, బెల్లం లేకుండానే ఈజీగా చేసుకోవచ్చు..! రోజూ ఒక్కటి తింటే చాలు..

Green Moong Dal Laddu: తీపి తినాలని ఉన్నా ఆరోగ్యం, ఫిట్‌నెస్ దృష్ట్యా చక్కెర లేదా బెల్లానికి దూరంగా ఉంటున్నారా? అయితే పచ్చ పెసలు, డ్రై ఫ్రూట్స్‌తో చేసే ఈ హెల్దీ లడ్డూ మీకు బెస్ట్‌ చాయిస్‌ . ఇందులో ఎటువంటి శుద్ధి చేసిన చక్కెర లేదా బెల్లం వాడరు. ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, పోషకమైన గింజలతో నిండిన ఈ లడ్డూలు రుచికరంగా ఉండటమే కాకుండా, ప్రొటీన్‌కు మంచి మూలం. కాగా, బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, పొద్దుతిరుగుడు, గుమ్మడి, చియా, అవిసె గింజలు శరీరం శక్తిని, గుడ్ ఫ్యాట్స్‌ను అందిస్తాయి. ఇది ఆరోగ్యకరమైన ప్రోటీన్ రిచ్ స్నాక్.

ప్రోటీన్ అంతులేనంత దొరికే పవర్‌ఫుల్‌ లడ్డు!.. పంచదార, బెల్లం లేకుండానే ఈజీగా చేసుకోవచ్చు..! రోజూ ఒక్కటి తింటే చాలు..
Green Moong Dal Ladoo Recipe

Updated on: Aug 17, 2026 | 4:17 PM

తీపి పదార్థాలు తినాలనే కోరిక ఉన్నప్పటికీ, బరువు పెరగడం లేదా ఆరోగ్య కారణాల వల్ల చాలామంది వాటికి దూరంగా ఉంటారు. అటువంటి వారి కోసం పచ్చ పెసలు, డ్రై ఫ్రూట్స్, విత్తనాల కలయికతో ఎంతో రుచికరమైన, పోషకాలతో నిండిన ప్రొటీన్ లడ్డూలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. చక్కెర, బెల్లం లేకుండా ప్రొటీన్‌తో నిండిన పచ్చ పెసర-డ్రై ఫ్రూట్స్ లడ్డూల తయారీ విధానం ఇప్పుడు చూద్దాం..

శక్తికి కూడా గొప్ప మూలం. వీటిని సులభంగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

కావలసిన పదార్థాలు:

పచ్చ పెసలు – 1 కప్పు (5-6 గంటలు నానబెట్టినవి)

ఇవి కూడా చదవండి

బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ – తలో ¼ కప్పు

పిస్తా – 2 టేబుల్ స్పూన్లు

గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు – అన్ని 2 టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకోవాలి.

చియా సీడ్స్, వేయించిన అవిసె గింజలు- ఇవి కూడా అన్నీ 1 టేబుల్ స్పూన్ చొప్పున

ఖర్జూరాలు గింజలు తీసి సన్నగా తరిగినవి – 8 నుండి 10

కిస్మిస్ – ¼ కప్పు

నేయి – 2 టేబుల్ స్పూన్లు

యాలకుల పొడి – ½ టీస్పూన్

తయారీ విధానం:

ముందుగా నానబెట్టిన పచ్చ పెసల నీటిని పూర్తిగా తీసేసి, శుభ్రమైన గుడ్డపై 15-20 నిమిషాలు ఆరబెట్టాలి. తేమ పోయాక, ఒక బాణలిలో నెయ్యి లేకుండా పెసలను సన్నని మంటపై దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కాస్త బరకగా రుబ్బుకోవాలి. అదే బాణలిలో బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, పిస్తా, గుమ్మడి, పొద్దుతిరుగుడు, అవిసె గింజలను దోరగా వేయించి, చల్లారిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు బాణలిలో నెయ్యి వేసి, తరిగిన ఖర్జూరాలు, కిస్మిస్ వేసి 2-3 నిమిషాలు వేయించాలి. ఇవి మెత్తబడి బైండింగ్‌లా మారుతాయి. ఇందులో బరకగా రుబ్బిన పెసర పిండి, వేయించిన డ్రై ఫ్రూట్స్, సీడ్స్, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని చిన్న లడ్డూలుగా చుట్టుకోవాలి.

ఈ లడ్డూలలో ఎలాంటి ఆర్టిఫిషియల్ స్వీటనర్లు ఉండవు. ఖర్జూరాలు, కిస్మిస్ సహజమైన తీపిని ఇస్తాయి. వ్యాయామం చేసేవారికి, పిల్లలకు, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన, ప్రోటీన్ నిండిన హెల్దీ స్నాక్.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us