అన్నం తిన్న వెంటనే ఎందుకు నిద్ర వస్తుంది..? మెదడులో జరిగే ఆ రహస్యం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

మధ్యాహ్నం పూట కడుపునిండా అన్నం తినగానే ఒళ్లంతా బద్ధకంగా మారి కళ్లు మూతలు పడుతున్నాయా? ఆఫీసుల్లో కునుకు తీస్తూ బాస్‌కు దొరికిపోతున్నారా? అయితే అస్సలు కంగారు పడకండి.. ఇది మీ బద్ధకం కాదు.. అన్నం తిన్న తర్వాత మీ మెదడులో జరిగే ఒక అద్భుతమైన కెమికల్ లోడింగ్. అసలు అన్నానికి, నిద్రకు ఉన్న లింక్ ఏంటో తెలుసుకుందాం..

అన్నం తిన్న వెంటనే ఎందుకు నిద్ర వస్తుంది..? మెదడులో జరిగే ఆ రహస్యం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
Feeling Sleepy After Eating Rice

Updated on: Jun 19, 2026 | 8:26 PM

భారతీయులలో చాలా మందికి మధ్యాహ్నం పూట వేడివేడిగా అన్నం తింటే గానీ తృప్తిగా ఉండదు. అయితే అన్నం తిన్న ఒక అరగంటకే కనురెప్పలు బరువెక్కడం, ఒళ్లంతా బద్ధకంగా మారి నిద్ర ముంచుకురావడం మనలో చాలా మంది రోజువారీ అనుభవమే. కొందరైతే దీనిని బద్ధకం అనుకుంటారు. మరికొందరు ఆఫీసుల్లో సీట్లలోనే కునుకు తీస్తూ ఇబ్బంది పడుతుంటారు. కానీ అన్నం తిన్న తర్వాత నిద్ర రావడానికి బద్ధకం కారణం కాదు.. దీని వెనుక ఒక పక్కా మానవ శరీర సైన్స్ దాగి ఉందని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చెబుతున్నారు. అన్నంలో కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. మనం అన్నం తిన్నప్పుడు శరీరం ఆ కార్బోహైడ్రేట్లను బ్రేక్ డౌన్ చేసి గ్లూకోజ్‌గా మారుస్తుంది. ఈ ప్రక్రియలో శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. ఈ ఇన్సులిన్ ప్రభావం వల్ల ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం మెదడుకు చేరుకుంటుంది. మెదడు ఈ ట్రిప్టోఫాన్‌ను ఉపయోగించి సెరోటోనిన్, ఆ తర్వాత మెలటోనిన్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఈ మెలటోనిన్ హార్మోన్ విడుదల కావడం వల్లే మనకు అన్నం తినగానే నిద్ర ముంచుకొస్తుంది.

జీర్ణక్రియ వైపు మళ్లే రక్తప్రసరణ

మనం భారీగా భోజనం చేసినప్పుడు, ఆ ఆహారాన్ని అరిగించడానికి జీర్ణవ్యవస్థ చాలా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. దీనికోసం శరీరంలోని రక్తప్రసరణ అధిక భాగం జీర్ణకోశం వైపు మళ్లుతుంది. ఫలితంగా మెదడుకు, శరీరంలోని ఇతర భాగాలకు రక్తప్రసరణ, ఆక్సిజన్ సరఫరా తాత్కాలికంగా కొద్దిగా తగ్గుతుంది. ఇది శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిన భావనను కలిగించి, నిద్రపోయేలా చేస్తుంది.

హై గ్లైసిమిక్ ఇండెక్స్

సాధారణ వైట్ రైస్‌కు గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. అంటే ఇది తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వేగంగా పెంచుతుంది. అలా షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగి, ఆ తర్వాత అంతే వేగంగా పడిపోతాయి. ఈ షుగర్ క్రాష్ జరిగినప్పుడు శరీరం తీవ్రమైన అలసటకు గురై, తక్షణ విశ్రాంతిని లేదా నిద్రను కోరుకుంటుంది.

మధ్యాహ్నపు నిద్రమత్తు వదలాలంటే ఏం చేయాలి?

ఆఫీసుల్లో లేదా పనివేళల్లో ఈ నిద్రమత్తు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే నిపుణులు కొన్ని సింపుల్ టిప్స్ చెబుతున్నారు..

అన్నం పరిమాణం తగ్గించండి: మధ్యాహ్నం పూట ప్లేట్ నిండా అన్నం తినే రకం అయితే, ఆ క్వాంటిటీని కాస్త తగ్గించి.. అందులో కూరలు, పప్పు, సలాడ్స్ లేదా ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి.

బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేయండి: వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ లేదా మినుములు, జొన్నలు వంటి తృణధాన్యాలు తీసుకుంటే షుగర్ లెవెల్స్ ఒకేసారి పెరగవు.

చిన్న వాక్: భోజనం చేసిన వెంటనే సీట్లో కూర్చోకుండా లేదా పడుకోకుండా.. ఒక 5 నుండి 10 నిమిషాల పాటు లైట్‌గా నడవండి. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి నిద్రమత్తును వదిలిస్తుంది.

Follow Us