Chicken Do Pyaza: చికెన్ తో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు.. డిఫరెంట్ టెస్ట్ కలిగిన చికెన్ ను ఎక్కువగా ఇష్టంగా తింటారు. తాజాగా ఈరోజు చికెన్ దో ప్యాజ్ తయారీ గురించి తెలుసుకుందాం.. ఇది సాధారణ చికెన్ మసాలా కర్రీలానే ఉంటుంది. అయితే ఉల్లిపాయలను ఎక్కువగా వాడటం వల్ల చికెన్ టెస్ట్ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అయితే రుచి మాత్రం అద్భుతం అనకమానరు ఎవరైనా .
చికెన్ – కేజి
ఉల్లిపాయలు – అరకేజి
టమోటా ప్యూరీ – 2 కప్పులు
గుడ్లు – 4 ఉడికించినవి
పెరుగు – పావు లీటరు
కారం – 2 టీ స్పూన్లు
గరం మసాలా – 1 టేబుల్ స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూను
పసుపు – 1 టీ స్పూను
ధనియాల పొడి – 1 టీ స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – తగినంత
ముందుగా ఒక పాన తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి. అందులో గరం మసాలా దినుసులు వేయాలి. తర్వాత మిక్సీలో పెరుగు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను వేయించిన గరం మసాలలో వేసి కలిపి వేయించాలి. రెండు నిమిషాల తరువాత అందులోనే అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ఈ మిశ్రమాన్ని కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత టమోటా గుజ్జు వేసి మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత అవసరమనుకుంటే కొద్దిగా నీళ్ళు కలుపుకోవాలి. ఉడుకుతున్న గ్రేవీలో చికెన్ ను కలిపి మరో పది నిమిషాలు మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించుకోవాలి. చికెన్ మెత్తగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసే ముందు ఉడికించిన గుడ్లను కలుపుకుని ఒక నిమిషం తర్వాత గుండ్రంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా అందులో వేసి ఉడికించాలి. అంతే చికెన్ దో ప్యాజ్ రెడీ. ఈ చికెన్ డో ప్యాజ్ బిర్యాని, చపాతీలకు అద్భుతమైనటువంటి కాంబినేషన్.
Also Read: కరోనాకు ఆప్తులను, స్నేహితులను కోల్పోయారా? అయితే శ్రీకృష్ణుడి అంత్యక్రియల గురించి తెలుసుకోవాల్సిందే
కూతురు పరీక్ష ఫీజు చెల్లించడానికి కిడ్నీలు అమ్ముకుంటాం.. అనుమతివ్వండి అంటూ ప్రభుత్వానికి వినతి