ఫ్ల్యూ వ్యాక్సిన్ వారికే బాగా చేస్తుంది

పెద్దల కంటే చిన్నపిల్లలలోనే ఫ్ల్యూ వ్యాక్సిన్ బాగా పనిచేస్తుందని ఇంగ్లండ్ పబ్లిక్ హెల్త్ సంస్థ(పీహెచ్‌ఈ) వెల్లడించింది. అందుకే ఈ ఏడాది చిన్న పిల్లలకు ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చి వ్యాధి వ్యాపించకుండా చాలామందిని రక్షించామని ఆ సంస్థ డాక్టర్లు అన్నారు. ఫ్ల్యూ వచ్చిన వారికి ఉపయోగించే నాజల్ స్ప్రే(ముక్కులోకి వేసే మందు) వాక్సిన్ వలన 2-17 సంవత్సరాల వయసున్న వారికి ఆ వ్యాధి తగ్గేందుకు 87% అవకాశాలు ఉండగా.. 18-64సంవత్సరాల వయసున్న వారికి కేవలం 39% మాత్రమే అవకాశం […]

ఫ్ల్యూ వ్యాక్సిన్ వారికే బాగా చేస్తుంది
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:39 PM

పెద్దల కంటే చిన్నపిల్లలలోనే ఫ్ల్యూ వ్యాక్సిన్ బాగా పనిచేస్తుందని ఇంగ్లండ్ పబ్లిక్ హెల్త్ సంస్థ(పీహెచ్‌ఈ) వెల్లడించింది. అందుకే ఈ ఏడాది చిన్న పిల్లలకు ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చి వ్యాధి వ్యాపించకుండా చాలామందిని రక్షించామని ఆ సంస్థ డాక్టర్లు అన్నారు.

ఫ్ల్యూ వచ్చిన వారికి ఉపయోగించే నాజల్ స్ప్రే(ముక్కులోకి వేసే మందు) వాక్సిన్ వలన 2-17 సంవత్సరాల వయసున్న వారికి ఆ వ్యాధి తగ్గేందుకు 87% అవకాశాలు ఉండగా.. 18-64సంవత్సరాల వయసున్న వారికి కేవలం 39% మాత్రమే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. 65సంవత్సరాలు పైబడిన వారికి ఈ వాక్సిన్ ఎలా పనిచేస్తుందో ఇంకా నిర్దారణకు రాలేదని వారు అన్నారు. ముఖ్యంగా అస్తమా, ఏంజినా, కాలేయ సమస్యలు ఉన్న వారికి ఈ వ్యాధి వస్తే వారికి బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వారు తెలిపారు. గతేడాది ఉపయోగించిన వాక్సిన్ 15% మాత్రమే పనిచేసిందని.. అందుకే ఈ ఏడాది మరింత మెరుగుగా ఉండేలా వాక్సిన్‌ను ఇచ్చామని వారు అన్నారు.

దీనిపై డాక్టర్ మేరీ రామ్‌సే మాట్లాడుతూ.. గతేడాది కంటే ఈ సంవత్సరం ప్రభావితమైన వాక్సిన్‌లను అన్ని వయసు గల వారికి ఇచ్చామని అన్నారు. పిల్లల వలన ఫ్ల్యూ సోకే అవకాశాలు త్వరగా వస్తాయని.. అందుకే మిగిలిన వారికంటే ముందు పిల్లలను రక్షించాలని తాము అనుకున్నామని చెప్పారు. దీనిపై తల్లిదండ్రులలో సామాజిక స్పృహను తీసుకొచ్చి వారి పిల్లలకు ఈ వాక్సిన్‌ను వేయించుకునేలా చేశామని పేర్కొన్నారు. ఈ వైరస్‌ బారి నుంచి అందరినీ రక్షించేందుకు ఇదే ఉత్తమమైన పద్ధతి అని, అందుకే పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేలా తల్లిదండ్రులకు ప్రోత్సహించామని చెప్పారు.

మరోవైపు హెల్త్ సెక్రటరీ మాన్ హాన్‌కాక్ మాట్లాడుతూ.. ఫ్ల్యూ నుంచి తమ పిల్లలను రక్షించుకోవడం కోసం తల్లిదండ్రులు చాలా చేస్తారని.. వారి కోసం ఈ వ్యాక్సిన్ బాగా పనిచేస్తుందని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది చాలా మంది పిల్లలు వ్యాక్సిన్ వేయించుకున్నారని, అందుకే వారిని ఈ వ్యాధి నుంచి కాపాడగలిగామని ఒకరకంగా ఇది పాజిటివ్ చర్య అని పేర్కొన్నారు. త్వరలో ఈ వ్యాధిని పూర్తిగా అంతమొందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.