Lifestyle: రోజూ వ్యాయామం చేస్తే.. ఆ సమస్యకు కూడా చెక్‌ పెట్టొచ్చు..

ఇటీవల నిర్వహించిన కొన్ని అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వారానికి కనీసం రెండు, మూడు సార్లు చేసినా రాత్రిపూట బాగా నిద్ర పడుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా...

Lifestyle: రోజూ వ్యాయామం చేస్తే.. ఆ సమస్యకు కూడా చెక్‌ పెట్టొచ్చు..
Study

Updated on: Apr 07, 2024 | 9:07 PM

వ్యాయామం చేయడం వల్ల ఎన్నో రకాల లాభాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ రోజూ వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు బలదూర్‌ అవుతాయి. ఊబకాయం మొదలు గుండె సంబంధిత సమస్యల వరకు ఎన్నో రకాల సమస్యలకు వ్యాయామం బెస్ట్ ఆప్షన్‌గా చెబుతారు. అయితే వ్యాయామంతో నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఇటీవల నిర్వహించిన కొన్ని అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వారానికి కనీసం రెండు, మూడు సార్లు చేసినా రాత్రిపూట బాగా నిద్ర పడుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరడచానికి కూడా వ్యాయామం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

నిద్రలేమి లక్షణాలు తగ్గడానికి శారీరక శ్రమ ఉపయోగపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పరిశోధన కోసం సుమారు 4400 మందిని ఎంచుకొని వారానికి ఎన్నిసార్లు, ఎంతసేపు, ఎంత తీవ్రతతో వ్యాయామం చేస్తున్నారు, నిద్రలేమి లక్షణాలు ఎలా ఉన్నాయి.? లాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. అలాగే రాత్రిపూట ఎంతసేపు పడుకుంటున్నారు.? పగటిపూట ఎంతవరకు మగతా ఉంటున్నారు.? అనే విషయాలను పరిశీలించి ఈ విషయాలను తెలిపారు.

వారానికి కనీసం రెండు, అంతకన్నా ఎక్కువసార్లు వ్యాయామం చేసేవారిని చురుకుగా ఉన్నవారిగా పరిగణనలోకి తీసుకుని వారి నిద్రకు సంబంధించిన అంశాలను పరిశీలించారు.ఇలాంటి వారిలో నిద్రలేమి ముప్పు 42 శాతం తక్కువగా ఉంటోందని గుర్తించారు. అలాగే వీరిలో నిద్రలేమి లక్షణాలు 22-40 శాతం వరకూ తక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us