
ఉదయాన్నే బార్లీ నీళ్లు తాగడం వల్ల శరీరానికి ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. బార్లీలో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగించడం ద్వారా బరువును నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాదు..ప్రతి రోజూ పరగడుపునే బార్లీ నీళ్లు తాగటం వల్ల కలిగే మరిన్ని లాభాలేంటో ఇప్పుడు చూద్దాం…
బార్లీలో ఫైబర్ (పీచుపదార్థం) అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఫిల్టర్ చేయని బార్లీ నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేసి, రోజంతా శరీరాన్ని చురుగ్గా ఉంచడానికి సహాయపడుతుంది.
బార్లీ నీటిలో ఉండే కరిగే ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువసేపు ఉంటుంది. దీనివల్ల అనవసరమైన ఆకలి కంట్రోల్ అవుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో జంక్ ఫుడ్స్, స్నాక్స్ తినాలనే కోరిక తగ్గుతుంది కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక ఉత్తమ పానీయం.
బార్లీ నీరు శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో గ్రేట్‌గా పనిచేస్తుంది. రోజూ బార్లీ నీళ్లు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా, మహిళల్లో ఎక్కువగా కనిపించే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల (UTI) ముప్పును తగ్గించడంలో ఇది సహజ నివారిణిగా ఉపయోగపడుతుంది.
డయాబెటిస్ ఉన్నవారికి బార్లీ నీరు ఎంతో మేలు చేస్తుంది. బార్లీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, బీటా-గ్లూకాన్స్ వంటి పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచడం ద్వారా మధుమేహ తీవ్రత తగ్గుతుంది.
రోజూ బార్లీ నీళ్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో ఎల్‌డీఎల్ (LDL) అనబడే చెడు కొలెస్ట్రాల్ పరిమాణం తగ్గుతుంది. ఇది గుండెపై ఉండే ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి గుండెను పదిలంగా ఉంచుతుంది. అలాగే, ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మం సాగే గుణాన్ని (ఇలాస్టిసిటీ) మెరుగుపరిచి, చర్మానికి సహజమైన మెరుపును, యవ్వనాన్ని అందిస్తాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..