మాస్క్ ను ఉతుకుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.! ప్రమాదం పొంచి ఉన్నట్లే!

భారత్‌పై కరోనా మహమ్మారి సునామీలా విరుచుకుపడుతోంది. సెకండ్ వేవ్ లో మహమ్మారి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఓవైపు ముమ్మరంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నడుస్తున్నా కేసులు భారీగా పెరుగుతుండటం భయాందోళనకు గురి చేస్తోంది.

మాస్క్ ను ఉతుకుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.!   ప్రమాదం పొంచి ఉన్నట్లే!
Covid Mask Mistakes
Follow us

| Edited By: Phani CH

Updated on: Apr 24, 2021 | 1:53 PM

భారత్‌పై కరోనా మహమ్మారి సునామీలా విరుచుకుపడుతోంది. సెకండ్ వేవ్ లో మహమ్మారి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఓవైపు ముమ్మరంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నడుస్తున్నా కేసులు భారీగా పెరుగుతుండటం భయాందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలో ప్రజలందరూ తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అందులో ముఖ్యంగా మాస్కులు ధరించడంతో పాటు సోషల్‌ డిస్టెన్స్‌ కూడా పాటించాలని మొదటినుంచి చెబుతూనే ఉన్నాయి.

దీనిలో భాగంగా ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు విధిగా మాస్కులు వాడుతున్నారు. అయినా పాజిటివ్‌ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. మాస్కులు పెట్టుకున్నప్పటికీ ఇలా ఎందుకు జరుగుతోంది? మాస్కుల విషయంలో మనం చేస్తున్న పొరపాట్లు ఏంటి? అసలు తప్పు ఎక్కడ జరుగుతోంది? కరోనా పాజిటివ్‌ కేసులు తీవ్ర స్థాయికి చేరడానికి కారణాలేంటి? ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలందరి ప్రశ్నలూ ఇవే. దీనిపై స్పందించిన వైద్య నిపుణులు మాస్కు ధరించడంలో కరోనాను ఎదుర్కోనే విషయంలో ప్రజలు చేస్తున్న పొరపాట్లను వారు తెలియజేశారు.

చాలామంది మాస్కుని సరిగా వేసుకోకపోవడం వల్లే కేసులు పెరిగిపోతున్నాయని గుజరాత్ లోని ప్రముఖ్ స్వామి మెడికల్ కాలేజీ డాక్టర్ హర్యాక్స్ పాఠక్ తెలిపారు. జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మాస్కుని ఎట్టి పరిస్థితుల్లో తీయరాదని.. కేవలం తినడానికి మాత్రమే మాస్కుని తియ్యాలని చెప్పారు. అంతేకాకుండా ఇక ప్రజలు చేస్తున్న మరో కామన్ మిస్టేక్.. మాస్కుని ఉతకడం.. ఇది చాలా తప్పు అని చెప్పుకొచ్చారు. ప్రధానంగా ఎన్ 95 సర్జికల్ మాస్కుని అస్సలు ఉతక్కూడదని అలా ఉతకడం వల్ల అది పనికి రాకుండా పోతుందన్నారు. మాస్కుని ఉతకడానికి బదులుగా ఆరుబయట ఎండలో ఆరబెట్టాలని తెలిపారు.

అన్నింటికంటే డబుల్ మాస్కు ధరించడం చాలా ఉత్తమమని.. చికిత్స కన్నా నివారణ మేలన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. అలాగే ఆవిరి పట్టడం, కర్పూరం వాసన పీల్చడం..ఇలాంటి హోమ్ రెడిడిస్ మంచిది కాదని..మందులకు అవి ప్రత్యామ్నాయం కాదనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమేనని.. వాటి మీద విశ్వాసం ఉంచాలన్నారు. ఆ టీకాల మీద నమ్మకం ఉంచినప్పుడే కరోనా పై మనం చేస్తున్న పోరాటం ముగుస్తుందని డాక్టర్ పాఠక్ తెలిపారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Corona Outbreak: వచ్చే నెల మధ్యలో ఇండియాలో కరోనా విస్ఫోటనం భారీగా ఉండబోతోందా? అమెరికా పరిశోధకులు ఏం చెబుతున్నారు?

iPhone 13 series: త్వరలో యాపిల్ నుంచి ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు.. అదిరిపోయే ఫీచర్స్‌..!

Latest Articles