మహిళల ఆరోగ్యానికి వరం లాంటిది ఈ జ్యూస్.. సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి!

కొత్తిమీర, పుదీనా, తులసి ఆకులతో తయారుచేసే జ్యూస్ ఆరోగ్యంపై ఆసక్తి ఉన్నవారికి మంచి పానీయం. ఈ మూడు ఆకుల్లో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి తోడ్పడతాయి. నిమ్మరసం, తేనె కలిపి సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ కథనంలో ఆరోగ్య ప్రయోజనాలు, తయారీ విధానం తెలుసుకోండి..

మహిళల ఆరోగ్యానికి వరం లాంటిది ఈ జ్యూస్.. సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి!
Herbal Juice

Updated on: Nov 22, 2026 | 10:36 PM

కొత్తిమీర, పుదీనా, తులసి – ఈ మూడు అద్భుతమైన ఆకుకూరల కలయికతో తయారయ్యే ఒక ప్రత్యేకమైన రసం.. సంపూర్ణ ఆరోగ్యానికి ఒక గొప్ప పానీయంగా ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్‌లో ఈ మూడింటి సమ్మేళనం వల్ల “సూపర్ రిజల్ట్” ఉంటుందని పేర్కొంటున్నారు. ఇది స్త్రీలలో అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుందని, పురుషులు కూడా దీన్ని తీసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు వివరించారు.

ఆరోగ్య ప్రయోజనాలు:

కొత్తిమీర, పుదీనా, తులసి జ్యూస్ ముఖ్యంగా స్త్రీల ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. ఫైబ్రాయిడ్ సమస్యలు, నెలసరి సంబంధిత ఇబ్బందులు, వైట్ డిశ్చార్జ్‌ వంటి సమస్యలను తగ్గించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల “సర్వ రోగాలు నయమైతాయి” అని కూడా సూచించారు. ఇది కేవలం స్త్రీలకు మాత్రమే కాకుండా, పురుషులకు కూడా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

తయారీ విధానం:

ఈ జ్యూస్ తయారీ చాలా సులువు.

శుభ్రపరచడం: ముందుగా కొత్తిమీర, పుదీనా, తులసి ఆకులను తీసుకోవాలి. ఆకుకూరలను ఎప్పుడూ గల్లుప్పు వేసి శుభ్రంగా కడగాలి. ఇది వాటిపై ఉండే పురుగుమందులు లేదా ఇతర మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది.

కొత్తిమీర, పుదీనా ఆకులను సమాన పరిమాణంలో తీసుకోవాలి. తులసి ఆకులను మాత్రం కొద్దిగా తక్కువ మోతాదులో తీసుకోవాలి.

శుభ్రం చేసిన ఆకులను ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. మిక్సీ చేయడానికి వీలుగా కొద్దిగా నీరు కలపాలి.

ఆకులను నీటితో కలిపి మెత్తగా పేస్ట్ చేయాలి.

ఒక బౌల్ తీసుకుని, దానిపై జల్లెడ పెట్టి, ఈ మిశ్రమాన్ని పోసి బాగా వడగట్టాలి. జ్యూస్ ఎప్పుడూ చిక్కగా ఉండకూడదు, పల్చగా ఉండాలి. అవసరమైతే, వడగట్టిన తర్వాత కూడా ఒక గ్లాస్ నీళ్లు కలిపి పల్చగా చేసుకోవచ్చు.

వడగట్టిన జ్యూస్‌లో సగం నిమ్మకాయ రసం కలపాలి. రుచిని బట్టి నిమ్మరసం పరిమాణాన్ని మీ ఇష్టానుసారం మార్చుకోవచ్చు.

తర్వాత, మూడు స్పూన్ల వరకు తేనెను కలపాలి. షుగర్ వ్యాధి ఉన్నవారు మాత్రం ఒక స్పూన్ తేనె వేసుకుంటే సరిపోతుంది. తేనె పరిమాణం మీ రుచికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు.

సేవించే విధానం:

ఈ ఆరోగ్యకరమైన రసాన్ని సరైన సమయంలో, సరైన పద్ధతిలో తీసుకోవడం చాలా ముఖ్యం:

ఉదయం పూట టిఫిన్ తినడానికి అరగంట ముందు ఈ జ్యూస్‌ను తీసుకోవాలి. సాయంత్రం అయితే నాలుగన్నర గంటల ప్రాంతంలో తీసుకోవడం మంచిదని పేర్కొంటున్నారు.

కేవలం జ్యూస్ మాత్రమే కాదు, తగినంత నీరు తాగడం కూడా చాలా అవసరం. ఉదయం నిద్రలేవగానే రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఒక గంట తర్వాత మరో రెండు గ్లాసుల నీళ్లు తాగాలి. ఆ తర్వాత అరగంట సేపటికి టిఫిన్ చేసే ముందు ఈ జ్యూస్ తీసుకోవాలని సూచించారు.

జ్యూస్‌ను హడావుడిగా త్రాగకుండా, కూర్చుని నెమ్మదిగా సేవించాలి. నెమ్మదిగా తాగినప్పుడే శరీరానికి పూర్తి ప్రయోజనాలు చేకూరి, బాడీలో బాగా అడ్జస్ట్ అవుతుంది.

కొత్తిమీర, పుదీనా, తులసి రసం అనేది సాధారణ ఆరోగ్య సంరక్షణలో ఒక భాగం. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

Loading...
Unable to load recommendations.
Follow Us