Sprouted Coconut: ఈ పువ్వులో ఏముందిలే అనుకుంటే మీరు పొరపడినట్టే.. ఇదో అమృతఫలం

కొబ్బరి పువ్వుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొలకెత్తిన కొబ్బరిని యాపిల్స్ అంటారు. అందుకే కొబ్బరికాయలో కొబ్బరిపువ్వు వస్తే దానిని వదలకుండా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆ కొబ్బరిపువ్వులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దానిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మరిన్ని లాభాలేంటో ఇక్కడ చూద్దాం..

Sprouted Coconut: ఈ పువ్వులో ఏముందిలే అనుకుంటే మీరు పొరపడినట్టే.. ఇదో అమృతఫలం
Sprouted Coconut

Updated on: Nov 11, 2025 | 2:16 PM

పోషకాలు సమృద్ధిగా ఉన్న కొబ్బరి పువ్వు అనేక పోషకాలకు పవర్‌ హౌజ్‌గా చెబుతున్నారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లతో సహా శరీరానికి అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. మొలకెత్తిన కొబ్బరికాయలను తినడం వల్ల శరీరానికి పోషణ అంది నిండైన ఆరోగ్యం లభిస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది మీ ఆకలిని అదుపులో ఉంచుతుంది. కేలరీలు తక్కువగా ఉండటం వలన బరువు పెరగకుండా ఉండటారు.

కొబ్బరిపువ్వు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది యాంటీమైక్రోబయల్, యాంటీవైరల్, యాంటీపెరాసిటిక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కొబ్బరి పువ్వు తినటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కొబ్బరి పువ్వు మీ జీవక్రియ రేటును ప్రేరేపిస్తుంది. అదనపు కొవ్వు కరిగించి సరైన శరీర ఆకృతిని పొందడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లతో సహా శరీరానికి అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. డయాబెటిక్‌తో ఇబ్బంది పడుతున్న వారు కూడా కొబ్బరిపువ్వును ఆనందంగా తినవచ్చు అంటున్నారు నిపుణులు.

క్యాన్సర్ నుండి రక్షణ కొబ్బరిపువ్వులోని పోషకాలు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటాయని చెబుతున్నారు. కొబ్బరిపువ్వును తినడం వల్ల మీరు అందమైన జుట్టు, ఆరోగ్యమైన చర్మాన్ని పొందవచ్చు. ఇది చర్మంపై చారలు, ముడతలు, మచ్చలు మొదలైన వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం, పరిష్కారాలు సాధారణ అవగాహన కోసం మాత్రమే. మేము వాటిని నిర్దారించడం లేదు. వాటిని స్వీకరించే ముందు ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us