కాళ్లలో మంటలు, తిమ్మిర్లతో ఇబ్బంది పడుతున్నారా? ఈ విటమిన్ లోపమే కారణం కావచ్చు..! వెంటనే అలర్ట్‌ అవ్వండి..

కాళ్లలో మంటలు, తిమ్మిర్లు, దులతో గుచ్చినట్లు అనిపించే సమస్యలకు (Burning Sensation & Tingling in Feet) ప్రధాన కారణాలు తెలుసుకోవాలి., వాటిని తగ్గించుకునే ఇంటి చిట్కాలను పాటిస్తూ... ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం వల్ల నరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

కాళ్లలో మంటలు, తిమ్మిర్లతో ఇబ్బంది పడుతున్నారా? ఈ విటమిన్ లోపమే కారణం కావచ్చు..! వెంటనే అలర్ట్‌ అవ్వండి..
Burning Feet At Night Cause

Updated on: Apr 01, 2026 | 8:14 PM

చాలామంది రాత్రిపూట పడుకునే సమయంలో కాళ్లలో విపరీతమైన మంటలు లేదా ఏదో పాకుతున్నట్లు, సూదులతో గుచ్చుతున్నట్లు అనిపిస్తుందని బాధపడుతుంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే నరాల బలహీనతకు దారితీస్తుంది. మస్యలకు ప్రధాన కారణాలు, టిని తగ్గించుకునే ఇంటి చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. వివరంగా తెలుసుకుందాం..

ప్రధాన కారణాలు:

విటమిన్ B12 లోపం: నరాల రక్షణ పొర (Myelin) ఆరోగ్యంగా ఉండటానికి B12 అవసరం. ఇది తగ్గితే నరాలు దెబ్బతిని మంటలు పుడతాయి.

ఇవి కూడా చదవండి

రక్త ప్రసరణ లోపం: కాళ్లకు రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే తిమ్మిర్లు వస్తాయి.

డయాబెటిక్ న్యూరోపతి: రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారిలో నరాలు త్వరగా దెబ్బతింటాయి.

సమస్యను తగ్గించే ఆహార నియమాలు:

పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, మజ్జిగలో విటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది.

ఆకుకూరలు: పాలకూర వంటి ఆకుకూరల్లో ఫోలేట్, రన్ ఉండటం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

డ్రై ఫ్రూట్స్: వాల్‌నట్స్, బాదం వంటివి నరాల బలానికి తోడ్పడతాయి.

ఇంటి చిట్కాలు:

మర్దన (Massage): రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె లేదా ఆవనూనెతో పాదాలను 10-15 నిమిషాలు మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి మంటలు తగ్గుతాయి.

గోరువెచ్చని నీటి చికిత్స: ఒక టబ్‌లో గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ (లేదా మామూలు ఉప్పు) వేసి పాదాలను 20 నిమిషాలు ఉంచాలి. ఇది నొప్పుల నుండి తక్షణ ఉపశమనం ఇస్తుంది.

నీరు ఎక్కువగా తాగడం: శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. కాళ్ల మంటలు కేవలం అలసట వల్ల వచ్చేవి కావచ్చు లేదా ఏదైనా పెద్ద అనారోగ్యానికి సంకేతం కావచ్చు. ప్రాథమిక చిట్కాలతో తగ్గకపోతే వెంటనే డాక్టరును కలిసి రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us