Brass vs Aluminum: ఇత్తడి.. అల్యుమినియం.. వంట చేసేందుకు ఏ పాత్రలు మంచి ఎంపిక?

మన పూర్త కాలం నుంచి అల్యూమినియం పాత్రలలో వంట చేయడం అలవాటు. అయితే ఇది అంత మంచి అలవాటు కాదని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అందువల్ల మంచి ఆరోగ్యం కోసం ఆలోచించేవారు ఇప్పుడు పాతకాలపు ఇత్తడి పాత్రలను వినియోగించాలని భావిస్తున్నారు. ఇత్తడి ప్రాథమికంగా రాగి, జింక్‌ల మిశ్రమలోహం..

Brass vs Aluminum: ఇత్తడి.. అల్యుమినియం.. వంట చేసేందుకు ఏ పాత్రలు మంచి ఎంపిక?
Brass Vs Aluminum Utensils For Cooking

Updated on: Apr 23, 2026 | 2:42 PM

అల్యూమినియం తేలికగా, చవకగా ఉండటం వల్ల చాలా మంది వంటగదులలో ఎక్కువగా వీటిని వినియోగిస్తుంటారు. కానీ ఇటీవలి అధ్యయనాలు, నిపుణుల సూచన మేరకు అల్యూమినియం పాత్రలలో వంట చేయడం అంత మంచిది కాదని పదేపదే హెచ్చరిస్తున్నారు. అందువల్ల మంచి ఆరోగ్యం కోసం ఆలోచించేవారు ఇప్పుడు పాతకాలపు ఇత్తడి పాత్రల వినియోగం పెంచుతున్నారు. ఇత్తడి ప్రాథమికంగా రాగి, జింక్‌ల మిశ్రమలోహం. ఇవి శరీరానికి చాలా అవసరం. ఇత్తడి పాత్రలలో ఆహారం లేదా టీ చేయడం వల్ల ఈ ఖనిజాలు కొద్ది మొత్తంలో ఆహారంలోకి విడుదలవుతాయి. ఇది శరీరంలోని రాగి, జింక్ లోపాలను సహజంగా భర్తీ చేయడానికి సహాయపడుతుంది.

వైద్యుల అభిప్రాయం ప్రకారం రాగి, జింక్ శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇత్తడి పాత్రలలో తయారుచేసిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక వ్యవస్థ మరింత చురుకుగా ఉంటుంది. ఫలితంగా శరీరం చిన్నపాటి ఇన్ఫెక్షన్లు లేదా కాలానుగుణ వ్యాధుల నుంచి వేగంగా కోలుకోగలదు. ఇత్తడి విశిష్ట లక్షణాలలో మరొకటి.. అది హానికరమైన బ్యాక్టీరియా, సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. అల్యూమినియంతో పోలిస్తే, ఇత్తడి పాత్రలలోని ఆహారం చాలా ఎక్కువ క్రిమిరహితంగా, సురక్షితంగా ఉంటుంది. శుభ్రత విషయంలో కొద్దిపాటి నిర్లక్ష్యం ఉన్నప్పటికీ ఇత్తడి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.

ఆయుర్వేదం ప్రకారం ఇత్తడి తాకిన నీరు లేదా ఆహారం జీవక్రియ రేటును పెంచడంలో సహాయపడుతుంది. గ్యాస్, గుండెల్లో మంట లేదా అజీర్ణంతో బాధపడేవారు ఇత్తడి పాత్రలు ఉపయోగించడం వరం. ఇది ప్రేగుల సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడి, జీర్ణక్రియ ప్రక్రియను సహజంగా సాగేలా చేస్తుంది. ఆమ్ల గుణం గల ఆహార పదార్థాలతో అల్యూమినియం కలిసినప్పుడు, అది ఒక రకమైన హానికరమైన విషప్రభావానికి కారణమవుతుంది. కానీ ఇత్తడి పాత్ర లోపలి భాగానికి తగరపు పూత లేదా ‘ప్లటింగ్’ చేసి ఉంటే.. ఇటువంటివి మాత్రమే వినియోగించాలి.

ఇవి కూడా చదవండి

ఇత్తడి అద్భుతమైన ఉష్ణ వాహకం కూడా. దానిలో వండిన ఆహారం రుచి, సువాసన చాలా సేపటి వరకు చెక్కుచెదరకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇత్తడి పాత్రలలో తయారు చేసిన టీ రుచి, సువాసన మరింత అద్భుతంగా ఉంటుంది. ఇది ఆహారాన్ని చాలా సేపటి వరకు వేడిగా ఉంచుతుంది. కాబట్టి పదేపదే మళ్లీ వేడి చేయడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇత్తడి వస్తువులను కొనుగోలు చేసే ముందు దాని లోపలి పొరపై ‘ప్లేటింగ్’ (తగరపు పూత) ఉందో లేదో చెక్‌ చేసుకోవాలి. ప్లేటింగ్ తొలగిపోతే.. ఇటువంటి పాత్రలు వినియోగించడం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి సకాలంలో తిరిగి పూత వేయడం అవసరం. అందువల్ల మీరు ఇత్తడిని సరైన నియమాల ప్రకారం ఉపయోగిస్తే పూర్తి వ్యాధి రహితంగా, ఆరోగ్యంగా జీవిచవచ్చు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 తెలుగు దీనిని నిర్ధారించడం లేదు. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించగలరు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us