వెండి నగలు పెట్టుకుంటే అదృష్టం మారుతుందా? సైన్స్, జ్యోతిష్యం చెప్పే షాకింగ్‌ నిజాలు తెలిస్తే..

మనదేశంలో పూర్వకాలం నుండి బంగారంతో పాటు వెండికి (Silver) కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. కేవలం అందం కోసం మాత్రమే కాకుండా, సాంప్రదాయాల ప్రకారం వెండి వస్తువులను లేదా ఆభరణాలను ధరించడం వెనుక బలమైన శాస్త్రీయ (Scientific), జ్యోతిష్య కారణాలు ఉన్నాయి. వెండి కేవలం ఒక లోహం మాత్రమే కాదు, ఇది శరీరంలోని శక్తిని సమతుల్యం చేసే ఒక అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. వెండి ఆభరణాలు ధరించడం వల్ల కలిగే 5 ప్రధాన ప్రయోజనాలు ఇక్కడ చూద్దాం:

వెండి నగలు పెట్టుకుంటే అదృష్టం మారుతుందా? సైన్స్, జ్యోతిష్యం చెప్పే షాకింగ్‌ నిజాలు తెలిస్తే..
Benefits Of Wearing Silver
Image Credit source: tv9 telugu

Updated on: May 31, 2026 | 1:08 PM

జ్యోతిష్యం, సైన్స్ ప్రకారం, వెండి ఆభరణాలు లేదా వస్తువులను ధరించడం వల్ల శరీరానికి, మనస్సుకు అనేక అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. వెండికి సహజంగానే శరీరాన్ని చల్లబరిచే గుణం (Cooling effect) ఉంటుంది. దీనిని ధరించడం వల్ల కోపం, మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. అలాగే, వెండిలో ఉండే యాంటీ-మైక్రోబియల్ గుణాలు చర్మ ఇన్‌ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా వెండి కీలక పాత్ర పోషిస్తుంది. మీ రోజువారీ జీవితంలో వెండి ఉంగరం లేదా గొలుసును ధరించడం ద్వారా ఎలాంటి సాజిటివ్ ఎనర్జీ లభిస్తుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది: వెండికి సహజంగానే చలవ చేసే గుణం ఉంటుంది. ఇది శరీరంలోని అదనపు వేడిని గ్రహించి, ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఎవరికైతే ఎక్కువగా బాడీ హీట్ సమస్య ఉంటుందో, వారు వెండి ఉంగరం లేదా గొలుసు ధరించడం వల్ల శరీరం చల్లబడుతుంది.

మానసిక ప్రశాంతతను ఇస్తుంది (ఒత్తిడి నివారణ): జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, వెండి చంద్రునికి సంబంధించిన లోహం. చంద్రుడు మనస్సుకు కారకుడు. కాబట్టి, వెండిని ధరించడం వల్ల తరచూ వచ్చే కోపం అదుపులోకి వస్తుంది. ఇది మానసిక ఒత్తిడి (Stress), ఆందోళనను (Anxiety) తగ్గించి, మనస్సుకు చెప్పలేనంత ప్రశాంతతను చేకూరుస్తుంది.

ఇవి కూడా చదవండి

అద్భుతమైన యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు: వెండిలో శక్తివంతమైన యాంటీ-మైక్రోబియల్, యాంటీ-బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయని సైన్స్ కూడా నిరూపించింది. ఇది చర్మంపై హానికరమైన బ్యాక్టీరియా లేదా వైరస్‌లు చేరకుండా రక్షిస్తుంది. పూర్వకాలంలో గాయాలు త్వరగా మానడానికి, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండటానికి వెండి పాత్రలను లేదా వెండి పూతలను ఉపయోగించడానికి కారణం ఇదే.

రక్త ప్రసరణ, హార్మోన్ల సమతుల్యత: వెండి ఆభరణాలు చర్మంతో నిరంతరం స్పర్శించడం వల్ల శరీరంలోని రక్తనాళాలు ఉత్తేజితమై, రక్త ప్రసరణ (Blood circulation) సజావుగా సాగుతుంది. ఇది కాకుండా, శరీరంలోని హార్మోన్ల వ్యవస్థను సమతుల్యం చేయడంలో కూడా వెండి సహాయపడుతుందని నమ్ముతారు.

ప్రతికూల శక్తి (నెగటివ్ ఎనర్జీ) నుండి రక్షణ: వెండి శరీరం చుట్టూ ఒక రకమైన సాజిటివ్ ఎనర్జీ ఫీల్డ్‌ను ఏర్పరుస్తుంది. ఇది మన చుట్టూ ఉండే నెగటివ్ ఎనర్జీని లేదా చెడు ప్రభావాలను దూరం చేస్తుంది. ముఖ్యంగా వెండి ఉంగరాన్ని చేతి బొటనవేలికి లేదా చూపుడు వేలికి ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

అందం, ఆరోగ్యాన్ని ఒకేసారి అందించే గుణం వెండికి ఉంది. కాబట్టి, మీ రాశి లేదా నక్షత్రానికి అనుకూలంగా, లేదా కేవలం ఆరోగ్య ప్రయోజనాల కోసమైనా సరే, మీ రోజువారీ జీవితంలో వెండిని ధరించడం ఒక మంచి అలవాటుగా మార్చుకోండి.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us