చలికాలం రాగానే.. ఏసీని బంద్ చేసే ముందు తప్పనిసరిగా పాటించాల్సిన 5 జాగ్రత్తలు ఇవే!

చలికాలం ప్రారంభం కాగానే చాలా ఇళ్లలో ఏసీ వినియోగం నిలిచిపోతుంది. వేసవి, వర్షాకాలం కలిపి సుమారు 6 నుంచి 8 నెలల పాటు ఉపయోగించిన తర్వాత, శీతాకాలంలో స్విచ్ ఆఫ్ చేసి నెలల తరబడి అలాగే వదిలేయడం సాధారణం. అయితే సాంకేతిక నిపుణుల ప్రకారం, ఏసీని శుభ్రం చేయకుండా అలాగే వదిలేయడం వల్ల లోపలి భాగాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. వచ్చే వేసవిలో రిపేర్ ఖర్చులు లేకుండా మంచి కూలింగ్ అందాలంటే, శీతాకాలంలో ఏసీని బంద్ చేసే ముందు ఈ 5 పనులు చేయడం మేలు:

చలికాలం రాగానే.. ఏసీని బంద్ చేసే ముందు తప్పనిసరిగా పాటించాల్సిన 5 జాగ్రత్తలు ఇవే!
Winter Ac Maintenance

Updated on: Nov 20, 2026 | 6:39 PM

శీతాకాలంలో ఏసీ వినియోగం తగ్గినప్పుడు దాన్ని అలానే వదిలేయకుండా 5 సులభమైన జాగ్రత్తలు పాటిస్తే, వచ్చే వేసవిలో సర్వీసింగ్ ఖర్చు తగ్గి మెరుగైన కూలింగ్ లభిస్తుంది. ముందుగా ఫిల్టర్లను తీసి గోరువెచ్చని నీరు, మైల్డ్ సోప్‌తో శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరిన తర్వాతే అమర్చాలి. బ్లోయర్, కాయిల్స్‌పై పేరుకున్న దుమ్మును మృదువైన బ్రష్ లేదా వాక్యూమ్ క్లీనర్‌తో తొలగించాలి. మరింత వివరంగా ఇప్పుడు చూద్దాం..

1. ఫిల్టర్లను శుభ్రంగా కడగడం: వేసవి, వర్షాకాలంలో ఏసీ ఫిల్టర్లలో దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా చేరుతాయి. శుభ్రం చేయకుండా వదిలేస్తే తేమ కారణంగా ఫంగస్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అందుకే ఫిల్టర్లను తీసి గోరువెచ్చని నీరు, మైల్డ్ సోప్‌తో కడిగి, ఎండలో పూర్తిగా ఆరిన తర్వాతే తిరిగి అమర్చాలి.

2. బ్లోయర్, కాయిల్స్ శుభ్రత: ఎవాపరేటర్ కాయిల్, బ్లోయర్‌పై కూడా దుమ్ము పేరుకుపోతుంది. ఇది గట్టిపడితే భవిష్యత్తులో కూలింగ్ తగ్గి కంప్రెసర్‌పై భారం పడుతుంది. మృదువైన బ్రష్ లేదా వాక్యూమ్ క్లీనర్ సహాయంతో వీటిని జాగ్రత్తగా శుభ్రం చేయాలి.

ఇవి కూడా చదవండి

3. ఫ్యాన్ లేదా ఆటో క్లీన్ మోడ్ వినియోగం: ఏసీని దీర్ఘకాలం బంద్ చేసే ముందు 30 నుంచి 45 నిమిషాల పాటు ఫ్యాన్ మోడ్ లేదా ఆటో క్లీన్ మోడ్‌లో నడపాలి. దీనివల్ల లోపలి తేమ, నీటి తడి ఆరిపోయి దుర్వాసన, తుప్పు సమస్యలు తగ్గుతాయి.

4. పవర్ ప్లగ్, రిమోట్ భద్రత: రిమోట్‌తో ఆఫ్ చేయడమే కాకుండా మెయిన్ స్విచ్ బోర్డు నుంచి ప్లగ్ కూడా తీసేయాలి. ఇది వోల్టేజ్ హెచ్చుతగ్గులు, షార్ట్ సర్క్యూట్ నుంచి రక్షణనిస్తుంది. అలాగే రిమోట్‌లోని బ్యాటరీలను తీసేయడం వల్ల బ్యాటరీ లీక్ అయి రిమోట్ పాడవకుండా ఉంటుంది.

5. ఇండోర్ యూనిట్, కంప్రెసర్‌కు కవర్లు: దుమ్ము, కీటకాలు లోపలికి వెళ్లకుండా ఇండోర్ యూనిట్‌కు మంచి కవర్ వేయాలి. బయట ఉండే అవుట్‌డోర్ కంప్రెసర్, పైపులపై మంచు, దుమ్ము, పక్షుల వ్యర్థాలు పడకుండా వాటర్‌ప్రూఫ్ కవర్ కప్పాలి.

ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల ఏసీ పనితీరు నిలకడగా ఉండి, వచ్చే వేసవిలో సులభంగా ఉపయోగించుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us