సింఘాల్‌పై జగన్ న‌మ్మ‌కం.. ఇంకొంత కాలం టీటీడీ ఈవోగా..

టీటీడీ ఈవోగా సేవ‌లందిస్తోన్న‌ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవ‌ర‌కు ఈవోగా కొనసాగాలని పేర్కొంది.

  • Ram Naramaneni
  • Publish Date - 1:29 pm, Sat, 18 July 20
సింఘాల్‌పై జగన్ న‌మ్మ‌కం.. ఇంకొంత కాలం టీటీడీ ఈవోగా..

టీటీడీ ఈవోగా సేవ‌లందిస్తోన్న‌ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవ‌ర‌కు ఈవోగా కొనసాగాలని పేర్కొంది. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రెసిడెంట్‌ కమిషనర్‌గా వ‌ర్క్ చేస్తోన్న‌ అనిల్ కుమార్ సింఘాల్‌ను 2017 మేలో తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం 25వ ఈవోగా డిప్యూటేషన్‌పై ట్రాన్స్ ఫ‌ర్ చేశారు. రెండేళ్ల పాటు ఉండే ఈ పదవికాలం ఉంటుంది. కాగా ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ 2019లో మరో ఏడాది డిప్యూటేషన్‌ను పొడగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా రెండోసారి డిప్యూటేషన్‌ను పొడిగిస్తూ… తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ ఈవోగా కొనసాగాలని వెల్ల‌డించింది.

కాగా టీటీటీ గౌరవ ప్ర‌ధాన అర్చ‌కుల ర‌మ‌ణ దీక్షితులు కొద్దికాలంగా ఈవో సింఘాల్ పై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌న చంద్ర‌బాబు దారిలోనే ప‌య‌నిస్తున్నార‌ని, జ‌గ‌న్ సూచన‌ల‌ను పాటించ‌డం లేద‌ని ఆరోపిస్తున్నారు. కానీ జ‌గ‌న్ స‌ర్కార్ మాత్రం ఆయ‌న‌పై న‌మ్మ‌కం ఉంచి పోస్టులో కొన‌సాగించింది. సింఘాల్ గత తెలుగుదేశం హయాంలో ఈవోగా నియమితులైనా, ప్రజంట్ వైసీపీ ప్రభుత్వంలోనూ ఆయనే కొనసాగుతుండటం విశేషం.