వైఎస్సార్ వాహనమిత్రకు నేడే ఆఖరి ఛాన్స్.. జూలై 4న ఖాతాల్లోకి రూ.10 వేలు

| Edited By:

Jun 26, 2020 | 8:45 AM

వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి దరఖాస్తు గడువు ఈ రోజుతో ముగుస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా ప్రకటించిన గడువు ఈ నెల 20 తో ముగియగా.. ఈ నెల 26 వరకు గడువు

వైఎస్సార్ వాహనమిత్రకు నేడే ఆఖరి ఛాన్స్.. జూలై 4న ఖాతాల్లోకి రూ.10 వేలు
Follow us on

వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి దరఖాస్తు గడువు ఈ రోజుతో ముగుస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా ప్రకటించిన గడువు ఈ నెల 20 తో ముగియగా.. ఈ నెల 26 వరకు గడువు పొడిగించింది ప్రభుత్వం. సొంత వాహనం కలిగి అర్హులైన డ్రైవర్లు ఇవాళ్టిలోగా దరఖాస్తు చేసుకుంటే.. ఈ నెల 28లోగా దరఖాస్తులను పరిశీలించి, జూలై 1న కలెక్టర్లు ఆమోదిస్తారు. అర్హులకు జూలై 4న అకౌంట్లోకి రూ. 10 వేలు జమచేస్తారు.

కరోనా లాక్‌డౌన్ వల్ల ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా ఉపాధి కోల్పోయిన డ్రైవర్ల కోసం రెండోసారి వాహనామిత్ర పథకం కింద నాలుగు నెలల ముందుగానే సాయం అందించారు సీఎం జగన్. డబ్బు నేరుగా బ్యాంక్ అకౌంట్ ద్వారా లబ్దిదారులకు అందేలా ఏర్పాట్లు చేశారు. డ్రైవర్లు కూడా ఆటోలు, వాహనాలను మంచి కండిషన్‌లో ఉంచుకోవాలని.. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని సూచించారు.

Also Read: జూలై 21 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర.. 15 రోజులకు కుదింపు..