నా విజయానికి చాలా కష్టపడ్డారు.. మీకు ధన్యవాదాలు : వైఎస్ జగన్

రసవత్తరంగా జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాలను గెలిచి అధికారాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ రెండో సీఎంగా గత నెల 30న బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో వేగాన్ని పెంచారు. కాగా ఈ ఎన్నికల్లో వైసీపీ విజయానికి సోషల్ మీడియాను ప్రధాన మాధ్యమంగా వినియోగించుకున్నారు ఆ పార్టీ కోసం పనిచేసినవారు. సోషల్ మీడియా వేదికగా గత ప్రభుత్వ లోపాలను చూపుతూ.. వైసీపీ గెలిస్తే ఏం చేస్తుందో చెబుతూ ఓటర్లలో అవేర్‌నెస్‌ను […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:41 am, Thu, 6 June 19
నా విజయానికి చాలా కష్టపడ్డారు.. మీకు ధన్యవాదాలు : వైఎస్ జగన్

రసవత్తరంగా జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాలను గెలిచి అధికారాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ రెండో సీఎంగా గత నెల 30న బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో వేగాన్ని పెంచారు. కాగా ఈ ఎన్నికల్లో వైసీపీ విజయానికి సోషల్ మీడియాను ప్రధాన మాధ్యమంగా వినియోగించుకున్నారు ఆ పార్టీ కోసం పనిచేసినవారు. సోషల్ మీడియా వేదికగా గత ప్రభుత్వ లోపాలను చూపుతూ.. వైసీపీ గెలిస్తే ఏం చేస్తుందో చెబుతూ ఓటర్లలో అవేర్‌నెస్‌ను తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వారందరికి సీఎం జగన్ తాజాగా అభినందనలు తెలిపారు.

ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ‘‘రాష్ట్రానికి బాధ్యతలు స్వీకరించిన వేళ.. నా కోసం కష్టపడ్డ సోషల్ మీడియా వారియర్స్‌కు స్పెషల్ థ్యాంక్స్. ఎల్లో మీడియాకు వ్యతిరేకంగా వైసీపీ కోసం, నా విజయం కోసం మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మీ అందరికి చాలా థ్యాంక్స్. మీ మద్దతు నాకు ఇలాగే కొనసాగుతుందని భావిస్తున్నా’’ అని పేర్కొన్నారు.