ఇదేదో బాగుంది.. తిండి తింటూ లక్షల్లో సంపాదిస్తోంది.. మీరు ట్రై చేస్తారా..?

| Edited By:

Nov 13, 2019 | 4:09 AM

ప్రతి మనిషి ఉద్యోగం చేసేది డబ్బులు సంపాదించుటకే. అయితే కొందరు మాత్రం ఉద్యోగం కాకుండా వ్యాపారం చేస్తూ కూడా డబ్బులు సంపాదిస్తుంటారు. ఇక ప్రస్తుత ఆధునిక యుగంలో అయితే.. సోషల్ మీడియాను ఉపయోగించి కూడా డబ్బులు సంపాదించవచ్చు. ముఖ్యంగా యూట్యూబ్‌ ద్వారా అనేక మంది లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. యూట్యూబ్‌లో వీక్షకులను ఆకట్టుకునే వీడియోలను పోస్ట్ చేస్తూ.. వాటి ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది కేవలం యూట్యూబ్‌ సంపాదనపైనే బతికేస్తున్నారు. […]

ఇదేదో బాగుంది.. తిండి తింటూ లక్షల్లో సంపాదిస్తోంది.. మీరు ట్రై చేస్తారా..?
Follow us on

ప్రతి మనిషి ఉద్యోగం చేసేది డబ్బులు సంపాదించుటకే. అయితే కొందరు మాత్రం ఉద్యోగం కాకుండా వ్యాపారం చేస్తూ కూడా డబ్బులు సంపాదిస్తుంటారు. ఇక ప్రస్తుత ఆధునిక యుగంలో అయితే.. సోషల్ మీడియాను ఉపయోగించి కూడా డబ్బులు సంపాదించవచ్చు. ముఖ్యంగా యూట్యూబ్‌ ద్వారా అనేక మంది లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. యూట్యూబ్‌లో వీక్షకులను ఆకట్టుకునే వీడియోలను పోస్ట్ చేస్తూ.. వాటి ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది కేవలం యూట్యూబ్‌ సంపాదనపైనే బతికేస్తున్నారు. యూట్యూబ్‌లో వీడియోలు పెట్టడం తొలుత హాబీగా ప్రారంభించి.. ఆ తర్వాత దానిని వృత్తిగా మార్చుకున్న వారు అనేకం ఉన్నారు. వీడియోలు పోస్ట్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు రావడంతో తమ ఉద్యోగాలను సైతం వదులుకుని పూర్తి సమయాన్ని దీని కోసమే కేటాయిస్తూ వస్తున్నారు కొంతమంది.

లండన్‌కు చెందిన చర్నా రైలీ అనే యువతి కూడా యూట్యూబ్ ద్వారా లక్షల్లో ఆదాయం వస్తోంది. దీంతో తన ఉద్యోగాన్నీ కూడా వదిలేసుకుంది. అయితే అంతా సాధారణంగా ఫన్నీ వీడియోస్ లేదా షార్ట్ ఫిల్మ్స్ వంటి కంటెంట్ పెట్టి డబ్బులు సంపాదిస్తుంటారు. కానీ ఈ యువతి ఎంచుకున్న కంటెంట్ చూస్తే షాక్ తింటారు. యూట్యూబ్‌లో అందర్నీ ఆకట్టుకునేందుకు తనకు ఇష్టమైన ఫుడ్‌నే కంటెంట్‌గా మార్చుకుంది ఈ యువతి.

ఇష్టమైన ఫుడ్ తింటూ.. ఆ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తుంది. ఇదే ఆమె పని. ఇదంతా వినడానికి వింతగా ఉన్నా.. ఆమె తింటున్న వీడియోలను నిత్యం 40 వేలమంది చూస్తున్నారట. తన వీడియోలకు ఈ స్థాయిలో స్పందన వస్తుండటంతో.. చర్నా చేస్తున్న ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి యూట్యూబ్ వీడియోలకే ఫుల్ టైంను కేటాయించేస్తోంది. హాయిగా రుచికరమైన ఫుడ్ (పిజ్జా, బర్గర్లు) తింటూ.. ఆ వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ ఆదాయాన్ని పొందుతుంది. ప్రస్తుతం ఈమె తినే తిండికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.