కోహ్లీని కొనియాడితే మీకెందుకు కాలుతుందో అర్థం కావడం లేదుః అక్తర్‌

|

Sep 03, 2020 | 4:52 PM

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి కోట్లాది మంది అభిమానులున్నారు.. కోహ్లి అంటే పాకిస్తాన్‌లోనూ పడిచచ్చిపోయేవాళ్లున్నారు.. ఆ మాటకొస్తే కోహ్లీ సొగసైన ఆటకు ముగ్ధులుకానివారెవ్వరు? పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ కూడా కోహ్లీ ఆటకు ఫిదా అవుతుంటాడు..

కోహ్లీని కొనియాడితే మీకెందుకు కాలుతుందో అర్థం కావడం లేదుః అక్తర్‌
Follow us on

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి కోట్లాది మంది అభిమానులున్నారు.. కోహ్లి అంటే పాకిస్తాన్‌లోనూ పడిచచ్చిపోయేవాళ్లున్నారు.. ఆ మాటకొస్తే కోహ్లీ సొగసైన ఆటకు ముగ్ధులుకానివారెవ్వరు? పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ కూడా కోహ్లీ ఆటకు ఫిదా అవుతుంటాడు.. తన యూట్యూబ్‌ ఛానెల్‌లో క్రికెట్ గురించి కొత్త కొత్త కబుర్లు చెబుతుంటాడు.. విశ్లేషిస్తుంటాడు.. ఆటగాళ్లకు సలహాలు సూచనలు ఇస్తుంటాడు.. మొన్నీమధ్య విరాట్ కోహ్లీ, రోహిత్‌శర్మల ఆటతీరును మెచ్చుకున్నాడు. ఆ మెచ్చుకోవడమే పాకిస్తాన్‌లోని కొందరికి నచ్చలేదు.. ఠాట్‌… పాక్‌లో ఉంటూ ఇండియన్‌ ప్లేయర్లను పొగుడుతావా? అంటూ అక్తర్‌ను ఆడిపోసుకున్నారు.. బౌన్సర్లతో, యార్కర్లతో బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టిన అక్తర్‌ ఇలాంటివాడికి జడుస్తాడా? తనను విమర్శించినవారిని లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ తీసుకున్నాడు.. కోహ్లీని కొనియాడితే మీకొచ్చిన నొప్పేమిటట? అంటూ ఎదురు ప్రశ్నవేశాడు. అసలు కోహ్లీని ఎందుకు పొగడకూడదో చెప్పండంటూ అడిగాడు.. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో కోహ్లీ సాధించిన రికార్డులే చెబుతాయి.. అతడెంత గొప్ప క్రికెటరో అంటూ మళ్లీ ప్రశంసించాడు అక్తర్‌.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరైన కోహ్లీని ఎవరైనా మెచ్చుకుంటారన్నాడు.. ఇంత తక్కువ సమయంలో 70 ఇంటర్నేషనల్‌ సెంచరీలు చేయడం మామూలు విషయం కాదన్నాడు.. ప్రస్తుతం అతడి దరిదాపుల్లో ఏ క్రికెటరూ లేడని వివరించాడు.. కోహ్లీ భారతీయుడైనంత మాత్రాన పనిగట్టుకుని అతడిని ద్వేషించాలా అంటూ తనను విమర్శిస్తున్నవారికి గట్టిగా జవాబిచ్చాడు అక్తర్‌.