వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇన్‌-యాప్‌ కొనుగోళ్లు, క్లౌడ్‌ హోస్టింగ్‌ సేవలు

వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త... ఇకపై వాట్సాప్‌ మెసెంజింగ్‌ యాప్‌ ద్వారా త్వరలో ఇన్‌-యాప్‌ కొనుగోళ్లు, క్లౌడ్‌ హోస్టింగ్‌ సేవలను అందుబాటులోకి రానున్నాయి.

వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇన్‌-యాప్‌ కొనుగోళ్లు, క్లౌడ్‌ హోస్టింగ్‌ సేవలు
Follow us

|

Updated on: Oct 23, 2020 | 8:11 AM

వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త… ఇకపై వాట్సాప్‌ మెసెంజింగ్‌ యాప్‌ ద్వారా త్వరలో ఇన్‌-యాప్‌ కొనుగోళ్లు, క్లౌడ్‌ హోస్టింగ్‌ సేవలను అందుబాటులోకి రానున్నాయి. ఫేస్‌బుక్‌ షాప్స్‌ ద్వారా వాట్సాప్‌లో వ్యాపారులు తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకునేందుకు వాట్సాప్‌ రంగం సిద్ధం చేస్తోంది. ఫేస్‌బుక్‌ షాప్స్‌ అనే ఆన్‌లైన్‌స్టోర్‌ను మే నెలలో ఫేస్‌బుక్‌ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కాగా, తన వాట్సాప్‌ మెసెంజింగ్‌ యాప్‌ త్వరలో ఇన్‌-యాప్‌ కొనుగోళ్లు, క్లౌడ్‌ హోస్టింగ్‌ సేవలను ప్రారంభించనుందని గురువారం మాతృ సంస్థ ఫేస్‌బుక్‌ తెలియజేసింది. దీంతో ఫేస్‌బుక్‌ ఆదాయాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 2014లో 19 బిలియన్‌ డాలర్లతో వాట్సాప్‌ను ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసిన సంతి తెలిసిందే. కాగా, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ల ద్వారా విక్రయాలను పెంచుకోవాలని ఫేస్‌బుక్‌ గట్టిగా ప్రయత్నిస్తోంది. కేవలం ఉత్పత్తుల విక్రయ సేవలే కాకుండా.. తన వినియోగదారు సేవల మెసెంజింగ్‌ టూల్స్‌ను వినియోగించుకునే కంపెనీలకు ఆ మెసేజ్‌లను ఫేస్‌బుక్‌ సర్వర్లలో నిల్వ చేసే క్లౌడ్‌ హోస్టింగ్‌ సేవలనూ అందించడం ద్వారా క్లౌడ్‌ కంప్యూటింగ్‌ రంగంలోకీ అడుగుపెట్టనుంది. ఈ ఏడాదిలోనే షాపింగ్‌ టూల్‌ మొదలవుతుందని, మెసేజ్‌ హోస్టింగ్‌ మాత్రం 2021 నుంచి అందుబాటులోకి రానున్నట్లు వాట్సాప్‌ సీఓఓ మాత్‌ ఇడేమా చెబుతున్నారు..

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు