Monkey Love: కోతి పిల్ల మనవరాలిని ముద్దు చేస్తున్న బోనోబో అమ్మమ్మ.. వీటినుంచి ఎంతో నేర్చుకోవాలంటున్న నెటిజన్లు..

Monkey Love: అసలు కంటే.. కొసరు ముద్దు అంటూ ఎవరికైనా తమ పిల్లలంటే ఎంత ఇష్టమో.. అంతకంటే ఎక్కువ ఇష్టం ప్రేమ మనవలు, మానవరాళ్ళపై ఉంటుంది. మనుషుల్లానే.. జంతువులు..

Monkey Love: కోతి పిల్ల మనవరాలిని ముద్దు చేస్తున్న బోనోబో అమ్మమ్మ.. వీటినుంచి ఎంతో నేర్చుకోవాలంటున్న నెటిజన్లు..
Grandmother Bonobo Monkey

Updated on: Jan 08, 2022 | 6:14 PM

Monkey Love: అసలు కంటే.. కొసరు ముద్దు అంటూ ఎవరికైనా తమ పిల్లలంటే ఎంత ఇష్టమో.. అంతకంటే ఎక్కువ ఇష్టం ప్రేమ మనవలు, మానవరాళ్ళపై ఉంటుంది. మనుషుల్లానే.. జంతువులు కూడా తమ పిల్లలను ఎంతో ప్రేమగా పెంచుతాయి. ఈ విషయం అనేకసార్లు.. పలు వీడియోల్లో చూస్తూనే ఉన్నాం.. అయితే ఇప్పుడు ఓ కోతి.. తన మనవరాలిని కూడా ఎంతో ప్రేమిస్తూ.. లాలిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇటీవల news.com.au తన సోషల్ మీడియా పేజీలో బోనోబో మంకీకి సంబంధించిన ఓ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో..  ఒక ముసలి ఆడ కోతి తన మనవరాలితో ఆడుకుంటూ కనిపిస్తుంది. ఈ బోనోబో కోతులు మానవుల పూర్వీకులుగా శాస్త్రజ్ఞులు చెబుతున్న సంగతి తెలిసిందే..

కోతి పిల్లతో ఆడుకుంటున్న ఆడ కోతి
ముసలి ఆడ కోతి చిన్న కోతి పిల్లకు తినడానికి ఆహారం అందిస్తోంది. అంతేకాదు.. ఎంతో ముద్దుగా చేస్తూ.. ఈ వృద్ధ కోతి తన మనవరాళ్లతో ఆడుకుంటూ.. కోతి పిల్లకు చక్కిలిగింతలు పెట్టి అది నవ్వుతుంటే.. తాను సంతోష పడుతూ.. అన్ని రకాలుగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ వీడియో చూస్తుంటే నిజంగానే ఈ కోతులు కూడా మనుషుల్లానే తమ ప్రేమని వ్యక్తం చేస్తున్నాయనిపిస్తోంది. మనవరాలు, అమ్మమ్మ ఇద్దరూ చాలా నవ్వుతూ కనిపించారు. ఈ వీడియో కేవలం 45 సెకన్ల మాత్రమే ఉంది..

4 లక్షల మంది లైక్ చేయగా కోట్లాది మంది వీక్షించారు. 14 వేల మందికి పైగా నెటిజన్లు కామెంట్ చేశారు. మనుషుల మాదిరిగానే కోతులు కూడా ఉన్నాయి.. అయినప్పటికీ మనం వాటిని జూలో ఉంచుతామని ఒక వ్యక్తి కామెంట్ చేయగా.. గా ఈ కోతులు చాలా తెలివైనవని మరో వ్యక్తి  వ్యాఖ్యానించాడు.  ఇలాంటి వీడియోలను చూసిన తర్వాత కూడా ప్రజలు జంతువులకు ఎలా హాని చేస్తారంటూ ఒక మహిళ కామెంట్ చేసింది. జంతువుల నుండి మనం ఇంకా చాలా నేర్చుకోవాలి అంటూ ఇంకొకరు.. ఇలా అనేక మంది కామెంట్ చేశారు.. మొత్తానికి మనవారు, అమ్మమ్మ ఆటలకు ఫిదా అయ్యారు.

 

Also Read:   వర్మ ఇప్పడు సినిమా ఇండస్ట్రీకి ఆశాకిరణం.. ఆర్జీవీ పెద్దదిక్కుగా మారాడా?…

Loading...
Unable to load recommendations.
Follow Us