టీడీపీని తిప్పికొట్టిన ప్రజలకు సలాం.. విజయసాయిరెడ్డి

అధికారం అంటే దోచుకోవడం, దాచుకోవడమేనని టీడీపీ వాళ్లు అనుకున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. అందుకే ప్రజలు వారిని తరిమి కొట్టారని ట్విట్టర్ వేదికగా టీడీపీపై విమర్శలు గుప్పించారు. టీడీపీని ప్రజలు తిప్పికొట్టడాన్ని మనం పవిత్ర బాధ్యతగా భావించాలని.. ప్రజలిచ్చిన అఖండ మెజారిటీ వారికి సేవ చేసేందుకు మాత్రమే అని అర్థం చేసుకోవాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తానేం చేసినా అడ్డుకోరాదనే చంద్రబాబు ఒక ఉద్యమమే చేశారని… ఏకంగా రాష్ట్రంలో అడుగుపెట్టకుండా సీబీఐని బ్యాన్ చేశారని అన్నారు. […]

టీడీపీని తిప్పికొట్టిన ప్రజలకు సలాం.. విజయసాయిరెడ్డి

Updated on: Jun 03, 2019 | 12:17 PM

అధికారం అంటే దోచుకోవడం, దాచుకోవడమేనని టీడీపీ వాళ్లు అనుకున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. అందుకే ప్రజలు వారిని తరిమి కొట్టారని ట్విట్టర్ వేదికగా టీడీపీపై విమర్శలు గుప్పించారు. టీడీపీని ప్రజలు తిప్పికొట్టడాన్ని మనం పవిత్ర బాధ్యతగా భావించాలని.. ప్రజలిచ్చిన అఖండ మెజారిటీ వారికి సేవ చేసేందుకు మాత్రమే అని అర్థం చేసుకోవాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

తానేం చేసినా అడ్డుకోరాదనే చంద్రబాబు ఒక ఉద్యమమే చేశారని… ఏకంగా రాష్ట్రంలో అడుగుపెట్టకుండా సీబీఐని బ్యాన్ చేశారని అన్నారు. ఐటీ దాడులు అడ్డుకున్నారని.. ఈడీ ఎలా వస్తుందని గతంలో టీడీపీ అధినేత ప్రశ్నించారని గుర్తు చేశారు. అయితే తమ నేత జగన్ మాత్రం.. సీబీఐని రాష్ట్రంలోకి అనుమతిస్తూ ఆదేశాలు జారీచేశారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us