AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Jihad Rocket: భారత్‌లో మరో ఐఎస్‌ఐ కుట్ర బట్టబయలు.. చెవిటి , మూగ పిల్లలే టార్గెట్‌.. మతమార్పిడిలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్‌

బధిరులు, మహిళలే వాళ్ల టార్గెట్‌.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు 1000 మందిని పైగా మతం మార్చారు. ఉత్తరప్రదేశ్‌ లోని నోయిడాలో మతమార్పిడులకు పాల్పడుతున్న ముఠాను ఎస్‌టీఎఫ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Love Jihad Rocket: భారత్‌లో మరో ఐఎస్‌ఐ కుట్ర బట్టబయలు.. చెవిటి , మూగ పిల్లలే టార్గెట్‌.. మతమార్పిడిలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్‌
Love Jihad Rocket Arrested In Uttar Pradesh
Balaraju Goud
|

Updated on: Jun 22, 2021 | 8:14 AM

Share

Love Jihad Rocket arrested in Uttar Pradesh: బధిరులు, మహిళలే వాళ్ల టార్గెట్‌.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు 1000 మందిని పైగా మతం మార్చారు. ఉత్తరప్రదేశ్‌ లోని నోయిడాలో మతమార్పిడులకు పాల్పడుతున్న ముఠాను ఎస్‌టీఎఫ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. జహంగీర్‌, ఉమర్‌ గౌతం అనే ఇద్దరు మతపెద్దలను అదుపు లోకి తీసుకున్నారు. పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ప్రోద్భలంతో ఈ ముఠా భారత్‌లో మతమార్పిడలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది.

ఉత్తరప్రదేశ్‌ , ఢిల్లీతో పాటు దేశం లోని పలు రాష్ట్రాల్లో ఈ ముఠా తమ రాకెట్‌ను కొనసాగిస్తునట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. విదేశాల నుంచి ఈ ముఠాకు భారీగా నిధులు కూడా అందినట్టు గుర్తించారు. ఈ రాకెట్‌లో 100 మందికి పైగా ఏజెంట్లు ఉన్నట్టు యూపీ పోలీసులు అనుమానిస్తున్నారు. జహంగీర్‌ , ఉమర్‌గౌతంను ఎస్‌టీఎఫ్‌ పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఒక్క ఏడాది లోనే 350 మందిని పైగా ఈ ముఠా మతం మార్చినట్టు తెలుస్తోంది. జహంగీర్‌ , ఉమర్‌గౌతంలు నోయిడాలో బధిరుల పాఠశాలను నిర్వహిస్తున్నారు. అమాయక మూగ, చెవిటి పిల్లలను మతం మారుస్తూ ఈ ముఠా డబ్బులు దండుకుంటోంది. గత రెండేళ్ల నుంచి ఈ ముఠా మతమార్పిడులకు పాల్పడుతున్నట్టు యూపీ పోలీసులు వెల్లడించారు. మహ్మద్‌ ఉమర్‌ గతంలో హిందువని , తరువాత ఇస్లాం స్వీకరించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. జహంగీర్‌, ఉమర్‌గౌతం ఢిల్లీలోని జామియానగర్‌లో నివాసముంటున్నారు. ఉమర్‌ గౌతం ఇస్లామిక్‌ దావా సెంటర్‌ అనే సంస్థను కూడా నడుపుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది.

జామియానగర్‌ లోని ఉమర్‌గౌతం కార్యాలయంలో పోలీసులు దాడులు చేసినప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ వ్యవహారంపై రాజకీయాలు కూడా ఊపందుకున్నాయి. బీజేపీ ప్రభుత్వం అనవసరంగా మైనారిటీ నేతలను వేధింపులకు గురి చేస్తోందని ఆప్‌ ఎమ్మెల్యే అమన్‌తుల్లాఖాన్‌ ఆరోపించారు. ఇదిలావుంటే, పోలీసులు ప్రత్యేక బృందాలతో దాడులు చేపట్టారు. ఇలా దుండగుల బంధీలో ఉన్నవారిని విడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read Also…  Lover Suicide: పెళ్లిప్పుడే వద్దన్న ప్రేయసి.. ఆవేశంతో నాలుగో అంతస్తు నుంచి దూకి ప్రేమికుడు ఆత్మహత్య