మొదలైన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌

|

Nov 03, 2020 | 3:24 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ మొదలయ్యింది… అమెరికా కాలమాన ప్రకారం రెండో తేదీ అర్ధరాత్రి నుంచి పోలింగ్‌ ప్రారంభమయ్యింది.. అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో అక్కడి కాలమానం ప్రకారం నవంబర్‌ మూడు ఉదయం నుంచే పోలింగ్‌ ప్రారంభమవుతుంది కానీ ఈశాన్య రాష్ట్రమైన న్యూ హాంప్‌షైర్‌లో మాత్రం అర్థరాత్రి ఓటింగ్‌ మొదలవుతుంది..1960 నుంచి హాంప్‌షైర్‌ ప్రజలు ఇలాగే ఓటు వేస్తున్నారు. న్యూ హాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లీ నాచ్‌ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ప్రజలు ఓటు వేశారు..ఈ గ్రామం కెనడా సరిహద్దుకు దగ్గరలో […]

మొదలైన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌
Follow us on

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ మొదలయ్యింది… అమెరికా కాలమాన ప్రకారం రెండో తేదీ అర్ధరాత్రి నుంచి పోలింగ్‌ ప్రారంభమయ్యింది.. అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో అక్కడి కాలమానం ప్రకారం నవంబర్‌ మూడు ఉదయం నుంచే పోలింగ్‌ ప్రారంభమవుతుంది కానీ ఈశాన్య రాష్ట్రమైన న్యూ హాంప్‌షైర్‌లో మాత్రం అర్థరాత్రి ఓటింగ్‌ మొదలవుతుంది..1960 నుంచి హాంప్‌షైర్‌ ప్రజలు ఇలాగే ఓటు వేస్తున్నారు. న్యూ హాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లీ నాచ్‌ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ప్రజలు ఓటు వేశారు..ఈ గ్రామం కెనడా సరిహద్దుకు దగ్గరలో ఉన్న అడవుల్లో ఉంటుంది.. ఆ గ్రామంలో మొత్తం 12 మంది నివసిస్తున్నారు.. అందులో అయిదురుగు మాత్రమే ఓటు వేశారు.. ఈ అయిదు ఓట్లు జో బైడెన్‌కు పడటం విశేషం. ట్రంప్‌కు ఒక్క ఓటు కూడా పడలేదు. ఇక డిక్స్‌విల్లీకి దగ్గరలో ఉన్న మిల్స్‌ఫీల్డ్‌లో ట్రంప్‌కు 16 ఓట్లు పోలైతే, బైడెన్‌కు అయిదు ఓట్లే పడ్డాయి.. కరోనా భయం కారణంగా హార్ట్స్‌ గ్రామస్తులు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. హార్ట్స్‌ గ్రామంలో 48 మంది ఓటర్లు ఉన్నారు.