Chinese Apps Bans : డ్రాగన్ కంట్రీకి మరో దెబ్బ.. ఎనిమిది చైనా కంపెనీల లావాదేవిలపై అమెరికా నిషేదం..

|

Jan 06, 2021 | 4:48 PM

డ్రాగన్ కంట్రీపై మరో దెబ్బ పడింది. అంతర్జాతీయంగా చైనాకు మరో డిజిటల్ ఎఫెక్ట్ అదిరిపోయేలా ఉంది. చైనాకు చెందిన 8 కంపెనీల అకౌంట్లపై వేటు వేసింది అగ్రరాజ్యం అమెరికా. లావాదేవీల అప్లికేషన్లను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది..

Chinese Apps Bans : డ్రాగన్ కంట్రీకి మరో దెబ్బ.. ఎనిమిది చైనా కంపెనీల లావాదేవిలపై అమెరికా నిషేదం..
Follow us on

Chinese Apps Bans : డ్రాగన్ కంట్రీపై మరో దెబ్బ పడింది. అంతర్జాతీయంగా చైనాకు మరో డిజిటల్ ఎఫెక్ట్ అదిరిపోయేలా ఉంది. చైనాకు చెందిన 8 కంపెనీల అకౌంట్లపై వేటు వేసింది అగ్రరాజ్యం అమెరికా. లావాదేవీల అప్లికేషన్లను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత ఆదేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సంతకం చేశారు.

గతంలోనూ ఈ తరహా యాప్​లపై అగ్రరాజ్యం వేటు వేసింది. తాజాగా యాంట్​ గ్రూపునకు చెందిన అలీ పేతో సహా కామ్​స్కానర్​, షేర్​ఇట్​, టెన్సెంట్​ క్యూక్యూ, వీమెట్​, డబ్ల్యూపీఎస్​ ఆఫీస్​ వంటివి ఈ జాబితాలో చేరాయి. ఇప్పటికే బీజింగ్​కు చెందిన వందల యాప్​లను అగ్రరాజ్యం సహా భారత్​ నిషేధించింది.

స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట‌్లు, కంప్యూటర‌్లు వంటి వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలలో ఈ చైనా సాఫ్ట్‌వేర్ యాప్​లు ఉంటాయి. అవి వినియోగదారుల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉంది. అందుకే మన జాతీయ భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నాము’ అని ఓ అధికారి వెల్లడించారు.

ఇవి కూడా చదవండి :

Buy Gold Jewellery : బంగారం కొనేందుకు వెళ్తున్నారా..? అయితే ఈ డాక్యుమెంట్స్ మరిచిపోవద్దు…
Janga Raghava reddy : వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న జంగా రాఘవ రెడ్డికి కరోనా పాజిటివ్..