లెక్క‌లు తిర‌గ‌రాస్తోన్న‌ యూపీఐ పేమెంట్స్..జూన్‌లో అత్య‌ధికం..

యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా జరిగే పేమెంట్స్ జూన్‌లో ఆల్ టైమ్ టాప్ రేంజుకి చేరాయి. జూన్‌ నెలలో మొత్తం 134 కోట్ల యూపీఐ లావాదేవీలు జ‌రిగాయి.

లెక్క‌లు తిర‌గ‌రాస్తోన్న‌ యూపీఐ పేమెంట్స్..జూన్‌లో అత్య‌ధికం..
Follow us

|

Updated on: Jul 03, 2020 | 2:14 PM

యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా జరిగే పేమెంట్స్ జూన్‌లో ఆల్ టైమ్ టాప్ రేంజుకి చేరాయి. జూన్‌ నెలలో మొత్తం 134 కోట్ల యూపీఐ లావాదేవీలు జ‌రిగాయి. ఈ లావాదేవీల మొత్తం విలువ దాదాపు రూ.2.62 లక్షల కోట్ల వరకు ఉంటుందని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లెక్క‌ల‌ను బ‌ట్టి తెలుస్తోంది.

మే నెలలో  123 కోట్ల లావాదేవీలు జ‌రిగాయి. వీటి విలువ దాదాపు రూ.2.18 లక్షల కోట్లు ఉంటుంది. మే తో పోలిస్తే జూన్‌లో లావాదేవీలు 8.94 శాతం పెరగాయి. మరోవైపు లాక్‌డౌన్ కార‌ణంగా ఆర్థిక కార్యకలాపాలు చాలావ‌ర‌కు నిలిచిపోవడంతో ఏప్రిల్‌లో యూపీఐ పేమెంట్స్ 99.57 కోట్లకు పరిమితమయ్యాయి. ఇటీవ‌ల‌ ‌ అన్ లాక్ ప్ర‌క్రియ మొద‌ల‌వ‌డంతో కార్యకలాపాలు మే నుంచి లావాదేవీలు మ‌ళ్లీ జోరుందుకున్నాయి. జూన్‌లో అవి రికార్డ్ రేంజుకి చేరాయి. స్మార్ట్ ఫోన్ వాడ‌కం పెర‌గడం, ఇంట‌ర్నెట్ వినియోగం పెర‌గ‌డం, ఈజీ ప‌ద్ద‌తి అవ్వ‌డం చేత‌.. 2019 అక్టోబరు తర్వాత నుంచి యూపీఐ లావాదేవీలు 100 కోట్లకు పైగా నమోదవుతూ వస్తున్నాయి. మళ్లీ ఈ ఏడాది ఏప్రిల్‌లో 100 కోట్ల దిగువకు వచ్చిన లావాదేవీలు.. తిరిగి మేలో పుంజుకొని 100 కోట్ల మార్క్ ని దాటాయి.