మతాంతర వివాహాలను ప్రోత్సహించే 44 ఏళ్ల కిందట పథకాన్ని రద్దు చేసిన యోగి సర్కార్‌

లవ్‌ జిహాద్‌ పేరుతో మతమార్పిడులు జరుగుతున్నాయంటూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కఠిన చట్టం తీసుకొచ్చింది.. ఉత్తరప్రదేశ్‌ బాటలోనే చాలా రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి. కొత్తగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌..

మతాంతర వివాహాలను ప్రోత్సహించే 44 ఏళ్ల కిందట పథకాన్ని రద్దు చేసిన యోగి సర్కార్‌

Updated on: Dec 02, 2020 | 4:31 PM

లవ్‌ జిహాద్‌ పేరుతో మతమార్పిడులు జరుగుతున్నాయంటూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కఠిన చట్టం తీసుకొచ్చింది.. ఉత్తరప్రదేశ్‌ బాటలోనే చాలా రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి. కొత్తగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ ప్రకారం మతమార్పిడులకు పాల్పడేవారికి పదేళ్లు కఠిన శిక్ష అమలు కానుంది.. ఇక ఇప్పుడు కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించే ఓ పాత పథకానికి కూడా స్వస్తి చెప్పాలనుకుంటోంది ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం. కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించడం కోసం 44 ఏళ్ల కిందట ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఓ స్కీమ్‌ను తెచ్చింది. 1976లో ప్రవేశపెట్టిన ఆ స్కీమ్‌ను ఇప్పుడు రద్దు చేయాలని భావిస్తున్నారు ముఖ్యమంత్రి యోగి. భిన్న మతాల వారు పెళ్లి చేసుకుంటే పెళ్లి జరిగిన రెండేళ్లలోపు జిల్లా మెజిస్ట్రేట్‌కు అప్లై చేసుకోవాలి. ఆ దరఖాస్తు ఆమోదం పొందితే ఆ దంపతులకు 50 వేల రూపాయలు ప్రోత్సాహకంగా అందుతాయి.. గత ఏడాది ఈ స్కీమ్‌ కింద 11 జంటలు లబ్ధిపొందాయి. ఈ ఏడాది అలాంటి వివాహాలు జరిగినా ఏ ఒక్కరికి నగదు ఇవ్వలేదు.. ఈ స్కీమ్‌ కోసం నాలుగు దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.