Under 19 World Cup Final: ఎంత పైకి ఎదిగినా.. ఒదిగి ఉండాలన్నది పెద్దవారి మాట. అయితే తొలిసారి అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన బంగ్లాదేశ్ క్రికెటర్లు మాత్రం ఈ సూత్రాన్ని మర్చిపోయి ఆటకే అవమానం కలిగించే విధంగా ప్రవర్తించారు. దక్షిణాఫ్రికాలోని డర్బన్ వేదికగా నిన్న భారత్‌తో జరిగిన ఫైనల్‌లో బంగ్లాదేశ్ పోరాడి గెలిచిన సంగతి తెలిసిందే. దీనితో వారు తొలిసారిగా ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచారు. అయితే కప్ గెలిచామన్న గర్వమో.. లేక పొగరో తెలియదు గానీ.. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆ జట్టు యువ ఆటగాళ్లు కాస్త అతిగా ప్రవర్తించారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రత్యర్థి ఆటగాళ్లలకు అభివాదం చేయడం అంతర్జాతీయ క్రికెట్‌లో ఆనవాయితీ. కానీ దాన్ని మరిచిన బంగ్లా ప్లేయర్స్.. భారత్ ఆటగాళ్లను గేలి చేస్తూ.. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ క్రికెట్ పరువు తీశారు. అంతటితో ఆగకుండా ఓ ఆటగాడు అయితే ఏకంగా భారత క్రికెటర్లతో వాగ్వాదానికి కూడా దిగాడు. చివరికి అంపైర్లు కలగజేసుకునే వరకు రెండు జట్ల మధ్య గొడవ సద్దుమణగలేదు.
Shameful end to a wonderful game of cricket. #U19CWCFinal pic.twitter.com/b9fQcmpqbJ
— Sameer Allana (@HitmanCricket) February 9, 2020