కక్షా రాజకీయాలు ఆయనవే.. చంద్రబాబుపై దగ్గుబాటి ఫైర్

వైఎస్ఆర్ పార్టీకి, బీజేపీకి మధ్య పొత్తు ఉందంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. ఆయన చేసే తప్పుడు వ్యాఖ్యలకు ప్రజలే సమాధానం చెబుతారని దగ్గుబాటి అన్నారు. చంద్రబాబు మీద తాను ఎటువంటి కక్ష రాజకీయాలు చేయలేదని.. బాబే తనపై కక్షా రాజకీయాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చినా కూడా తాను మంచి కోసమే పాటుపడతానని ఆయన పేర్కొన్నారు. స్వార్ధ రాజకీయాల కోసం తాను వైసీపీలో చేరలేదని […]

కక్షా రాజకీయాలు ఆయనవే.. చంద్రబాబుపై దగ్గుబాటి ఫైర్

Updated on: Apr 29, 2019 | 12:55 PM

వైఎస్ఆర్ పార్టీకి, బీజేపీకి మధ్య పొత్తు ఉందంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. ఆయన చేసే తప్పుడు వ్యాఖ్యలకు ప్రజలే సమాధానం చెబుతారని దగ్గుబాటి అన్నారు. చంద్రబాబు మీద తాను ఎటువంటి కక్ష రాజకీయాలు చేయలేదని.. బాబే తనపై కక్షా రాజకీయాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చినా కూడా తాను మంచి కోసమే పాటుపడతానని ఆయన పేర్కొన్నారు. స్వార్ధ రాజకీయాల కోసం తాను వైసీపీలో చేరలేదని అన్నారు. టీవీ9 ఎన్‌‌కౌంటర్ విత్ మురళీ కృష్ణ కార్యక్రమంలో ఆయన ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే…

Follow Us