శ్రీవారి భ‌క్తుల‌కు గుడ్ న్యూస్…ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటా పెంపు

తిరుమల తిరుపతి దేవస్థానం.. భ‌క్తుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల వెంక‌టేశ్వ‌ర‌స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను టిటిడి పెంచింది. స్లాట్‌కు 250 టికెట్ల చొప్పున... రోజుకు 3 వేల టికెట్ల చొప్పున రిలీజ్ చేసింది.

శ్రీవారి భ‌క్తుల‌కు గుడ్ న్యూస్...ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటా పెంపు
Ram Naramaneni

|

Jun 19, 2020 | 7:27 AM

తిరుమల తిరుపతి దేవస్థానం.. భ‌క్తుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల వెంక‌టేశ్వ‌ర‌స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను టిటిడి పెంచింది. స్లాట్‌కు 250 టికెట్ల చొప్పున… రోజుకు 3 వేల టికెట్ల చొప్పున రిలీజ్ చేసింది. నేటి(శుక్ర‌వారం) నుంచి ఈనెల 30 వరకు సదరు టికెట్లు భ‌క్తుల‌కు అందుబాటులో ఉంటాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశారు దేవ‌స్థానం అధికారులు. ఇప్పటికే ఈ నెలాఖరు వరకు రోజుకు 3 వేల చొప్పున‌ టికెట్లను విక్రయించిన టిటిడి…ఎక్కువ‌ మందికి దర్శనం కల్పించే ఆలోచ‌న‌తో అదనపు కోటా రిలీజ్ చేసింది.

మ‌రోవైపు క‌రోనా వేళ శ్రీవారి ద‌ర్శ‌నం విష‌యంలో అధికారులు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. మాస్క్ త‌ప్ప‌నిస‌రి చేయ‌డంతో పాటు భ‌క్తులు భౌతిక దూరం పాటించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కాగా గ్ర‌హణం నేప‌థ్యంలో జాన్ 21న శ్రీవారి ఆల‌యం మూత‌ప‌డ‌నుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu