‘నన్ను విమర్శించే ఆ పుస్తకాన్ని బహిష్కరించండి’.. ట్రంప్

తనను, తన ప్రభుత్వ విధానాలను వేలెత్తి చూపే, లేదా విమర్శించే ఎలాంటి రాతలనైనా, పుస్తకాలనైనా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. బహుశా అందులో భాగంగానే తమ దేశ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ రాసిన ఓ పుస్తకాన్ని ఆయన దాదాపు..

'నన్ను విమర్శించే ఆ పుస్తకాన్ని బహిష్కరించండి'.. ట్రంప్
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Jun 18, 2020 | 5:04 PM

తనను, తన ప్రభుత్వ విధానాలను వేలెత్తి చూపే, లేదా విమర్శించే ఎలాంటి రాతలనైనా, పుస్తకాలనైనా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. బహుశా అందులో భాగంగానే తమ దేశ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ రాసిన ఓ పుస్తకాన్ని ఆయన దాదాపు బ్యాన్ చేశారు. అది విడుదల కాకుండా చూడడానికి తమ ‘న్యాయ శాఖ’ ‘తోడ్పాటును’ కూడా తీసుకున్నారు. ఇది రిలీజ్ కాకుండా అడ్డు కోవడానికి ఆయన రెండో సారి ప్రయత్నించారు. కేవలం లాభాల కోసం క్లాసిఫైడ్ సమాచారాన్నివిస్తృతంగా.. విమర్శనాత్మకంగా వ్యాపింపజేసేందుకు ఉద్దేశించిన ఈ బుక్ విడుదల కాకుండా ఎమర్జెన్సీ ఉత్తర్వులను జస్టిస్ విభాగం జారీ చేసింది. ‘ది రూమ్ వేర్ ఇట్ హ్యాపెండ్’ అనే ఈ పుస్తకంలో జాన్ బోల్టన్.. ట్రంప్ ‘తెర వెనుక బాగోతాలను’ బయటపెట్టారు.అమెరికా రైతుల నుంచి వ్యవసాయోత్పతులను చైనా కొనుగోలు చేయాలని ఆ దేశాన్ని ట్రంప్ కోరారని, పైగా అధ్యక్ష పదవికి నవంబరులో జరిగే ఎన్నికల్లో తనకు సాయం చేయాల్సిందిగా చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ని కోరారని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఇలాగే పలు ఆరోపణలు చేశారు.

అయితే ట్రంప్ మాత్రం యధాప్రకారం ఈ ఆరోపణలను కొట్టివేస్తూ.. ఈ రచయిత చట్టాన్ని ఉల్లంఘించారని, ఇది తప్పుడు సమాచారమని ట్వీట్ చేశారు. ఇందులో అన్నీ అబధ్ధాలు, ఫేక్ స్టోరీస్ ఉన్నాయని అన్నారు. జాన్ బోల్టన్ ప్రచారం చేసుకుంటున్న సంఘటనలేవీ జరగలేదన్నారు. ఆయనను మూర్ఖుడుగా అభివర్ణించారు. కాగా…  ఈ పుస్తకం అప్పుడే వాషింగ్టన్ లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu