రోడ్ యాక్సిడెంట్: ప్రమాద బాధితుల్ని ఆస్పత్రిలో చేర్పించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఇప్పటికే పలు సందర్భాల్లో మానవత్వాన్ని ప్రదర్శించిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన పెద్దమనసును చాటుకున్నారు...

  • Venkata Narayana
  • Publish Date - 12:37 pm, Tue, 22 December 20
రోడ్ యాక్సిడెంట్: ప్రమాద బాధితుల్ని ఆస్పత్రిలో చేర్పించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఇప్పటికే పలు సందర్భాల్లో మానవత్వాన్ని ప్రదర్శించిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన పెద్దమనసును చాటుకున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నిజామాబాద్ నగరం, కంఠేశ్వర్ మీదుగా వెళ్తున్న ‌కవిత, అదే దారిలో రోడ్డు ప్రమాదానికి గురై గాయపడిన మహిళను చూసి చలించిపోయారు. వెంటనే వాహనం దిగి మహిళను‌ ఆస్పత్రిలో చేర్పించారు. బాధితురాలి బంధువులు కవితకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, అటు కరోనా లాక్ డౌన్ సమయంలోనూ కవిత తన ఉదారతను అనేకసార్లు ప్రదర్శించారు. పాఠశాల విద్యార్థులకు తోడ్పాటు విషయంలోనూ కవిత ముందుండటం తెలిసిందే.