తమ బైక్ మోడ్సల్ తో యువత మనస్సు గెలుచుకున్న కవాసాకీ కంపెనీ తన బైక్స్ పై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తుంది. కవాసకీ తమ బైక్ తయారీలో తన ప్రత్యేకతను ఎప్పుడూ చాటుకుంటూ ఉంటుంది. ఎన్ని బైక్స్ పోటీలో ఉన్నా తన స్థిరమైన మార్కెట్ తో ప్రత్యర్థులకు ఎప్పుడూ సవాల్ విసురుతూనే ఉంటుంది. కొత్త ఏడాదిలో పెద్దగా తన బైక్స్ పై తగ్గింపును ప్రకటించలేదు. దాంతో పాటు మార్కెట్ లో ఎలక్ట్రిక్ బైక్స్ హవా కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కవాసాకీ కంపెనీ ఆలోచనలో పడి తగ్గింపును ఆఫర్ చేస్తుంది. అయితే అన్ని బైక్స్ పై కాకుండా కేవలం సెలెక్ట్ చేసిన మూడు మోడల్స్ పై మాత్రమే తగ్గింపును ప్రకటించింది. ఈ తగ్గింపు కూడా ఫిబ్రవరి 28 వరకూ మాత్రమే అందుబాటులో ఉండనుంది. కంపెనీ ఆఫర్ ప్రకటించే ఆ మూడు మోడల్స్ బైక్స్ ఏంటో ఓ సారి చూద్దాం.
డబ్ల్యూ 800 నియో రెట్రో మోటర్ సైకిల్. ఈ మోడల్ పై కంపెనీ దాదాపు రూ.2 లక్షల తగ్గింపును ఆఫర్ చేస్తుంది. రూ.7.33 లక్షల ఉన్న ఈ బైక్ ప్రస్తుతం రూ.5.33 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. డబుల్ సిలిండర్లతో పాటు ఎయిర్ కూల్డ్ ఫోర్ స్ట్రోక్ వర్టికల్ ట్విన్ 773 సీసీ ఇంజిన్ తో ఇది వినియోగదారులను ఆకట్టుకుంది. 14 లీటర్ల ఇంధన సామర్థ్యంతో వస్తున్న ఈ బైక్ లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ తో పాట బ్యాక్ డ్రమ్ బ్రేక్ వస్తుంది.
కవాసాకీ భారతీయ లైనప్ లో ఎక్కువ కాలం నడుస్తున్న నింజా లైనప్ లో నింజా 300 పై రూ.15000 తగ్గింపును కంపెనీ ఆఫర్ చేస్తుంది. రూ.3.40 లక్షలున్న బైక్ ఇప్పుడు రూ.3.25 లక్షలకే అందుబాటు ఉంది. 296 సీసీ ఇంజిన్ తో డబుల్ డిస్క్ బ్రేక్ తో వచ్చే ఈ బైక్ ను యువత ఎక్కువగా ఇష్టపడుతుంది.
జెడ్ 650, జెడ్ 650 ఆర్ఎస్ బైక్ ధరలను కంపెనీ రూ.50,000 వరకూ తగ్గించింది. జెడ్ 650 ఇప్పుడు రూ.5.93 లక్షలకు అందుబాటులో ఉంటే జెడ్ 650 ఆర్ఎస్ రూ.6.42 లక్షలకు అందుబాటు ఉంది. ఈ రెండు బైక్స్ లో 649 సీసీ ఇంజిన్ తో పాటు డబుల్ డిస్క్ బ్రేకులు ఉంటాయి. డబుల్ సిలిండర్లతో లిక్విడ్ కూల్ ఇంజిన్ ఈ బైక్స్ ప్రత్యేకత.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..