టాప్ 10 న్యూస్ @ 6PM..

| Edited By:

May 25, 2019 | 5:57 PM

1.మోదీ ఒక గొప్ప వ్యక్తి: డొనాల్డ్‌ ట్రంప్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నరేంద్రమోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభినందనలు తెలియజేశారు. ఎన్నికల ఫలితాలు తెలియగానే ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్‌.. శుక్రవారం మోదీకి స్వయంగా…Read more 2.గవర్నర్‌ను కలుసుకున్న జగన్ ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన ఆయన గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ […]

టాప్ 10 న్యూస్ @ 6PM..
Follow us on

1.మోదీ ఒక గొప్ప వ్యక్తి: డొనాల్డ్‌ ట్రంప్

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నరేంద్రమోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభినందనలు తెలియజేశారు. ఎన్నికల ఫలితాలు తెలియగానే ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్‌.. శుక్రవారం మోదీకి స్వయంగా…Read more

2.గవర్నర్‌ను కలుసుకున్న జగన్

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన ఆయన గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు…Read more

3.నేను తప్పు చేసి ఉంటే క్షమించండి: బోడె ప్రసాద్

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ బుల్లెట్‌పై తన నియోజకవర్గం పెనమలూరులో తిరిగారు. తనకు ఓటు వేసిన వాళ్లకు, వేయని వారికి కృతజ్ఞతలు చెబుతూ ముందుకు సాగారు. తానేదైనా తప్పు చేసి ఉంటే క్షమించాలని…Read more

4.వేదిక ఖరారు.. జగన్ ప్రమాణస్వీకారానికి మొదలైన ఏర్పాట్లు

ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రమణ్యం నేతృత్వంలోని ఉన్నతస్థాయి…Read more

5.బావకు మహేశ్ అభినందనలు

రసవత్తరంగా సాగిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఎంపీగా రెండోసారి విజయకేతనం ఎగరవేశారు గల్లా జయదేవ్. ఈ సందర్భంగా ఆయనకు హీరో మహేశ్ బాబు అభినందనలు తెలిపాడు. ఎంపీగా రెండోసారి విజయం సాధించిన గల్లా జయదేవ్‌కు…Read more

6.’రోజాది ఐరెన్ లెగ్ కాదు’ : జీవితా

కొన్ని కొన్ని మాటలు వింటూంటే చాలా బాధేస్తుందని తెలిపారు వైసీపీ నాయకురాలు, యాక్టర్ జీవిత. కొంతమంది ‘రోజాది ఐరెన్ లెగ్ అని, ఆమె గెలుస్తే పార్టీ ఓడిపోతుందని, పార్టీ గెలుస్తే ఆమె ఓడిపోతుందని కామెంట్స్ చేశారు’…Read more

7.“నేను కూడా మాస్” కావాలంటే చూడండి …

ఆగస్టు రెండు వస్తున్నా కాచుకోండి అని చుట్ట కాలుస్తున్న పోస్టర్ రిలీజ్ చేసారు రణరంగం టీం . సుధీర్ వర్మ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా కూడా రీసెంట్ ట్రెండ్ కి తగ్గట్టు 1990 ల నాటి కథ . ఒక టైం పీరియడ్ కి వెళ్ళిపోయి దానికి తగ్గట్టు…Read more

8.నేడే సమంతా ‘ఓ బేబీ’ టీజర్!

సమంతా ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రయోగాత్మక చిత్రం ‘ఓ బేబీ’. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లేడి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఏళ్ల వయసున్న వృద్ధురాలి ఆత్మ, 20 ఏళ్ల…Read more

9.విరాట్ కోహ్లీ మనిషి కాదు… పరుగుల మెషీన్’: బ్రియాన్ లారా

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మనిషి కాదు.. పరుగుల మెషీన్ అని వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా తెలిపారు. ఇంగ్లండ్ వేదికగా ఈ నెల 30 నుండి ఐసీసీ ప్రపంచకప్‌ సమరం ప్రారంభం కానుంది. ఈ ప్రపంచకప్‌లో ఫేవరెట్…Read more

10.బాక్సింగ్‌లో భారత్‌కు పసిడి పంట

ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్ చరిత్ర సృష్టించింది. శుక్రవారంతో ముగిసిన ఇండియా ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో స్వర్ణాన్ని దక్కించుకుంది. టోర్నీలో భారత బాక్సర్లు రాణించడంతో భారత్‌కు పసిడి…Read more