విశాఖలో రేపటి నుంచి ఆర్టీసీ బస్‌పాస్‌లు జారీ

కరోనా ప్రభావంతో ముందుగా జిల్లాల బస్సులకే పరిమితమైన ఏపీఎస్ఆర్టీసీ సిటీబస్సులను కూడా రోడ్డెక్కిచ్చింది. తాజాగా సోమవారం నుంచి బస్‌పాస్‌లు జారీచేయాలని నిర్ణయించారు.

విశాఖలో రేపటి నుంచి ఆర్టీసీ బస్‌పాస్‌లు జారీ

Edited By:

Updated on: Oct 04, 2020 | 10:51 AM

కరోనా మహమ్మారి ధాటికి స్తంభించిపోయిన ప్రజా రవాణా వ్యవస్థ ఇప్పడిప్పుడే మొదలైంది. ముందుగా జిల్లాల బస్సులకే పరిమితమైన ఏపీఎస్ఆర్టీసీ సిటీబస్సులను కూడా రోడ్డెక్కిచ్చింది. తాజాగా సోమవారం నుంచి బస్‌పాస్‌లు జారీచేయాలని నిర్ణయించారు విశాఖ ఆర్టీసీ అధికారులు. మొదటి దశలో మద్దిలపాలెం, ద్వారకా కాంప్లెక్సు, స్టీల్‌ సిటీ కాంప్లెక్సులలో పాస్‌లు ఇవ్వనున్నట్టు రీజనల్‌ మేనేజర్‌ ఎంవై దానం తెలిపారు. జనరల్‌, ఎన్‌జీవో, దివ్యాంగుల పాస్‌లతో పాటు నెలవారీ సీజనల్‌ టికెట్‌లు, స్టీల్‌ప్లాంట్‌ ఎక్స్‌క్లూజివ్‌ బస్‌పాస్‌లు జారీ చేయనున్నట్టు ఆయన వివరించారు. మరో వారం తరువాత అన్ని డిపోల్లోనూ పాస్‌లు జారీ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Loading...
Unable to load recommendations.
Follow Us