Time Travel Restaurant: ఈ హోటల్‌లో అడుగు పెడితే.. వందేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది.. ఎక్కడంటే.

Time Travel Restaurant: సింగీతం శ్రీనివాసరావు అద్భుత సృష్టి.. ఆదిత్య 369.. లోని టైం మిషన్‌ గురించి తెలుసుకదా...  నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన...

Time Travel Restaurant: ఈ హోటల్‌లో అడుగు పెడితే.. వందేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది.. ఎక్కడంటే.
Time Travel Restaurant
Follow us

|

Updated on: Nov 01, 2021 | 7:54 PM

Time Travel Restaurant: సింగీతం శ్రీనివాసరావు అద్భుత సృష్టి.. ఆదిత్య 369.. లోని టైం మిషన్‌ గురించి తెలుసుకదా…  నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఆదిత్య 369 సినిమాలోని టైమ్‌ మిషన్‌లో  ప్రయాణించి హీరో హీరోయిన్లు ఏకంగా శ్రీకృష్ణ దేవరాయల కాలంలోకి వెళ్లిపోతారు. అంతేకాదు మన ముందు ముందు జనరేషన్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తుంది. అయితే అది సినిమా… అయితే టైమ్ మిషన్  ఎలా  గతంలోకి తీసుకెళ్ళిందో.. అదే విధంగా నిజ జీవితంలో కూడా ఒక ప్రదేశం గతంలోకి తీసుకుని వెళ్తుంది. అప్పటి కాలంలోని జీవన విధానాన్ని మీకు పరిచయం చేస్తుంది, అయితే ఇదేమీ టైం మిషన్‌ కాదు.. ఒక రెస్టారెంట్‌. సాధారణంగా రెస్టారెంట్లు మంచి ఇంటీరియర్‌ డిజైన్లతో, షాండ్లియర్‌ వెలుగులతో మెరిసిపోతూ ఉంటాయి. అటువంటి వింత రెస్టారెంట్ రష్యాలో ఉంది. దీని స్పెషాలిటీ ఏమిటో చూదాం..

రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ లో ఉండే “లే కరేజ్‌’ అనే ఈ రెస్టారెంట్లో అడుగు పెట్టగానే గతంలోకి వెళ్లినట్టే ఉంటుంది. వందేళ్ల కిందటి భవనంలా, కూలిపోతుందేమో అన్నట్లు కనిపిస్తుంది. కానీ అదంతా ఓ ప్రత్యేకమైన ఇంటీరియర్‌ డిజైనింగ్‌. ఈ రెస్టారెంట్‌ని 19వ శతాబ్దపు భవనం లాగా రూపొందించారు. కావాలనే ఇక్కడి గోడలు తడిగా, వర్షానికి నానిపోయి ఉబ్బినట్లు కనిపిస్తాయి. చాలా చోట్ల పెచ్చులు ఊడిపోవడం, సుత్తితో పగలగొట్టినట్లుగా డిజైన్ చేసి ఉంటుంది.

ఇక ఇందులో ఫర్నిచర్ కూడా చాలా పురాతనమైనది. గదుల్లో పైకప్పులు కూడా పడిపోబోతున్నాయి అనిపించే విధంగా డిజైన్ చేశారు. లోపల అంతా 19వ శతాబ్దపు వాల్‌ పేపర్లు, బంగారు వర్ణంలో ఉండే వస్తులే ఉంటాయి. ఎండిపోయిన పువ్వుల అలంకరణ, అక్కడక్కడా పచ్చని మొక్కలు ఉంటాయి. ఆధునికత అన్నదే ఉండదు. ఇంక నేలపై చెక్క ఫ్లోర్‌బోర్డ్‌లు, తలుపులు, ఫర్నిచర్‌పై లే కరేజ్ లోగో స్ప్రే చేసినట్లు ఉంటుంది. వంటగదిలో వంటలు కూడా 19వ శతాబ్దంలో ప్రజలు తినేవే… ఇప్పుడూ వండుతున్నారు. ఆనాటి చరిత్రాత్మక వంటకాలను కస్టమర్లకు వడ్డిస్తారు. ఈ రెస్టారెంట్‌ని సందర్శించే ప్రజలు పాత ఆహారపు రుచులను తెలుసుకోవడమే కాకుండా… లోపలి చారిత్రక వాతావరణానికి ఎంతో ముగ్దులవుతారు. ఒక్కసారిగా టైమ్ ట్రావెల్ చేసి… గతంలోకి వెల్లినట్లు ఫీలవుతారు. ఇదండీ.. ఈ రెస్టారెంట్‌ ప్రత్యేకత.

Also Read:  పచ్చిమిర్చి తింటే నాలుగు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. అవి ఏమిటంటే..

Latest Articles
మీన రాశిలో కుజుడు..ఆ రాశుల వారికి రాజ యోగాలు.. దోషాలు కూడా!
మీన రాశిలో కుజుడు..ఆ రాశుల వారికి రాజ యోగాలు.. దోషాలు కూడా!
లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై.. సచిన్ కుమారుడు వచ్చేశాడు
లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై.. సచిన్ కుమారుడు వచ్చేశాడు
రోజుని మష్రూమ్ కాఫీతో ప్రారంభించండి.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
రోజుని మష్రూమ్ కాఫీతో ప్రారంభించండి.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
దోసకాయ తొక్క.. పనికిరాదని పారేయకండి.. లాభాలు తెలిస్తే అవాక్కే!
దోసకాయ తొక్క.. పనికిరాదని పారేయకండి.. లాభాలు తెలిస్తే అవాక్కే!
ఉత్తరాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వింత వాతావరణం..!
ఉత్తరాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వింత వాతావరణం..!
మేష రాశిలో బుధుడు..ఆ రాశుల వారికి పలు సమస్యల నుంచి విముక్తి
మేష రాశిలో బుధుడు..ఆ రాశుల వారికి పలు సమస్యల నుంచి విముక్తి
వ్యాక్సిన్లపై సంచలనం రేపుతున్న పరిశోధనలు!
వ్యాక్సిన్లపై సంచలనం రేపుతున్న పరిశోధనలు!
యువ ఫుట్‌బాల్ క్రీడాకారుల కోసం కదిలిన టీవీ 9 నెట్‌వర్క్..
యువ ఫుట్‌బాల్ క్రీడాకారుల కోసం కదిలిన టీవీ 9 నెట్‌వర్క్..
ఆంధ్రాకు భారీ వర్ష సూచన.. ముఖ్యంగా ఈ జిల్లాల్లో
ఆంధ్రాకు భారీ వర్ష సూచన.. ముఖ్యంగా ఈ జిల్లాల్లో
మీ ఇంట్లోని ట్యాప్‌, షవర్‌ నుండి నీళ్లు తక్కువగా వస్తున్నాయా..?
మీ ఇంట్లోని ట్యాప్‌, షవర్‌ నుండి నీళ్లు తక్కువగా వస్తున్నాయా..?