‘టిక్ టాక్’ కు చిర్రెత్తుకొచ్చింది

|

Aug 25, 2020 | 2:23 PM

ఆడవాళ్ల టాలెంట్, సాధికారతపై విశేషమైన ప్రభావాన్ని చూపింది టిక్ టాక్. మహిళామణులు తమలోని ప్రతిభను అవధుల్లేకుండా చాటేందుకు ఈ యాప్ ఇతోధికంగా దోహదం చేసింది. అయితే, చైనా విపరీత చేష్టలతో ఇండియాలో..

టిక్ టాక్ కు చిర్రెత్తుకొచ్చింది
Follow us on

ఆడవాళ్ల టాలెంట్, సాధికారతపై విశేషమైన ప్రభావాన్ని చూపింది టిక్ టాక్. మహిళామణులు తమలోని ప్రతిభను అవధుల్లేకుండా చాటేందుకు ఈ యాప్ ఇతోధికంగా దోహదం చేసింది. అయితే, చైనా విపరీత చేష్టలతో ఇండియాలో ‘టిక్ టాక్’కు టాటా చెప్పేశారు. ఇప్పుడు అమెరికా కూడా అదే దారిలో పయనిస్తోన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15లోగా టిక్ టాక్ తమ దేశంలో కార్యకలాపాలు క్లోజ్ చేయాలని ట్రంప్ సర్కార్ ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. అయితే, దీనిపై టిక్ టాక్ యాజమాన్యం రివర్స్ అటాక్ కు దిగింది. కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమగోడు అమెరికా యంత్రాంగం పట్టించుకోకపోవడంతో కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని విన్నవించింది.

దేశ భద్రత కోసం అని చెబుతున్నప్పటికీ ట్రంప్ సర్కారు కేవలం రాజకీయ దురుద్ధేశ్యంతోనే టిక్ టాక్ పై నిషేధం విధిస్తోందని కోర్టుకు తెలిపింది. టిక్ టాక్ యాప్ ను నిషేధించేందుకు యాజమాన్య సంస్థ ‘బైట్ డాన్స్’ ఆస్తులను వదులుకోవాల్సిందిగా ఆదేశం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చేందుకు ట్రంప్ సర్కారు ఈ విధానం అవలంభిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు ట్రంప్, కామర్స్ సెక్రటరీ విల్బర్ రాస్, అమెరికా వాణిజ్య శాఖలపై ఫిర్యాదు చేసింది. అంతేకాదు, యూజర్ల సమాచారం అమెరికా, సింగపూర్ లలో అత్యంత సురక్షితంగా ఉంటుందని భరోసా ఇచ్చింది.

ఇలాఉంటే, టిక్ టాక్ తాజా ఫైట్ మార్కెట్లో దాని విలువ పెరిగేందుకు దోహదపడుతోందని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా విశేషంగా పేరుగాంచిన టిక్ టాక్ మీద నిషేధ నిర్ణయాల నేపథ్యంలో ఆ సంస్థను కొనుగోలు చేసేందుకు రిలయన్స్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ పోటీ పడుతోన్న సంగతి విదితమే.