నార్త్ కొరియాలో కలకలం.. కిమ్‌కు ప్రాణ సంకటం.!

|

May 10, 2020 | 1:58 PM

తమ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ బ్రతికే ఉన్నారని సంతోషించేలోపే నార్త్ కొరియన్లకు కొత్త చిక్కు వచ్చిపడింది. ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ భయభ్రాంతులకు గురి చేస్తుంటే.. ఉత్తర కొరియా మాత్రం తమ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా లేదని చాటి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ దేశం ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్(ఏఎస్ఎఫ్) ధాటికి విలవిలలాడుతోంది. నార్త్ కొరియాలోని పలు ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉందని సౌత్ ప్యోంగాన్ మీడియా […]

నార్త్ కొరియాలో కలకలం.. కిమ్‌కు ప్రాణ సంకటం.!
Follow us on

తమ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ బ్రతికే ఉన్నారని సంతోషించేలోపే నార్త్ కొరియన్లకు కొత్త చిక్కు వచ్చిపడింది. ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ భయభ్రాంతులకు గురి చేస్తుంటే.. ఉత్తర కొరియా మాత్రం తమ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా లేదని చాటి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ దేశం ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్(ఏఎస్ఎఫ్) ధాటికి విలవిలలాడుతోంది. నార్త్ కొరియాలోని పలు ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉందని సౌత్ ప్యోంగాన్ మీడియా తెలిపింది. ఉత్తర హ్వాంగ్హే ప్రావిన్స్, నార్త్, దక్షిణ ప్యోంగన్ ప్రావిన్సులలో పరిస్థితి తీవ్రంగా మారిందని చెబుతోంది.

Read This: కిమ్ మరణం వెనుక రహస్యమిదే.. దేశద్రోహులు గుర్తింపు.. వారికి చావే గతి!

ఇదిలా ఉంటే ఉత్తర కొరియాలో ప్రతీ కుటుంబం ఒకటి నుంచి మూడు పందుల్ని విధిగా పెంచుతుంటారు. ఆ దేశ ఎకానమీలో పోర్క్ వాడకం, ఎగుమతులు వాటా అతి ముఖ్యమైనవి. ఇక ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ప్రధానంగా పందులకు మాత్రమే సోకుతుంది. ఇప్పటికే ఆ దేశంలో వేల సంఖ్యలో పందులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక నిజమైతే.. వాటిపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది పరిస్థితి దయనీయంగా మారుతుంది. అటు పిగ్ ఫార్మింగ్ రంగంపై కూడా వైరస్ ప్రభావం తీవ్రతరంగా ఉంటుంది.

Read This: గుడ్ న్యూస్.. పాత హాల్ టికెట్లతోనే టెన్త్ పరీక్షలు…

ఇక ఇప్పుడు ఇదే కిమ్‌కు ప్రాణ సంకటంగా మారింది. ఒక పక్క అంతర్జాతీయ ఆంక్షలతో అనేక ఇబ్బందుల పడుతున్న నార్త్ కొరియాకు.. కరోనా కారణంగా చైనా నుంచి రావాల్సిన ఫండింగ్ కూడా ఆగిపోయింది. అటు అణ్వాయుధాలను నిర్వీర్యం చేస్తే అన్ని రకాలుగా ఆదుకుంటామని ఐక్యరాజ్యసమితి భరోసా ఇస్తున్నా డిక్టేటర్ కిమ్ మాత్రం స్పందించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తన పంధాను మార్చుకుని కిమ్ సంచలన నిర్ణయం తీసుకుంటారో లేదో అన్నది వేచి చూడాలి. కాగా, ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వల్ల ఇండియాలోని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే.

Read This: లాక్ డౌన్ తర్వాత.. పెళ్లిళ్లు చేసుకోవాలంటే ఈ రూల్స్ తప్పనిసరి!