”ధోని, కోహ్లీ మధ్య తేడా అదే”

|

Aug 26, 2020 | 3:53 PM

వైవిధ్యమైన ఆటతీరు, కూల్ కెప్టెన్సీకి పెట్టింది పేరు మహేంద్రసింగ్ ధోని, దూకుడుతనానికి కేర్ ఆఫ్ అడ్రెస్ ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇద్దరిది భిన్నమైన శైలి.

ధోని, కోహ్లీ మధ్య తేడా అదే
Follow us on

Dhoni And Kohli Differences: వైవిధ్యమైన ఆటతీరు, కూల్ కెప్టెన్సీకి పెట్టింది పేరు మహేంద్రసింగ్ ధోని, దూకుడుతనానికి కేర్ ఆఫ్ అడ్రెస్ ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇద్దరిది భిన్నమైన శైలి. ఒకరు వీరిద్దరూ కూడా భారత్ జట్టుకు ఎన్నో అపురూపమైన విజయాలను అందించారు. అటు అభిమానులు మాత్రమే కాదు.. ఎంతోమంది మాజీ క్రికెటర్లు, దిగ్గజాలకు కూడా వీరిద్దరి ఆట అంటే చాలా ఇష్టం. వికెట్ల వెనుక కూల్‌గా ఉంటూ.. క్లిష్ట పరిస్థితుల్లో కూడా జట్టును విజయతీరాలకు చేర్చడంలో ధోనిది అందవేసిన చెయ్యి. అలాగే టార్గెట్ ఏదైనా కూడా సునాయాసంగా చేధించడంలో మాస్టర్ విరాట్ కోహ్లీ. వీరిద్దరి మధ్య వ్యత్యాసాన్ని తాజాగా భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్ వివరించాడు.

కెప్టెన్సీ విషయంలో ఇద్దరిది భిన్నమైన శైలి. ధోని ఎక్కువగా స్పిన్నర్ల మీద నమ్మకం పెడితే.. కోహ్లీ ఫాస్ట్ బౌలర్లపై అతిగా ఆధారపడతాడు. అందుకే అతని ప్రస్థానంలో బుమ్రా, ఇషాంత్, షమీ, భువనేశ్వర్ లాంటి పేసర్లు ప్రపంచంలోనే ది బెస్ట్‌గా నిలిచారు. అలాగే ధోని ఉన్నప్పుడు చాహల్- కుల్దీప్ జోడి భీకర బ్యాట్స్ మెన్లను సైతం వణికించింది. ఇదే ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం అని అగార్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో తెలిపాడు.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ పరీక్ష రాయకున్నా పాస్.!

వరద బాధితులకు ఏపీ సర్కార్ చేయూత..!

వృత్తి పన్ను పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..