‘సమంత స్కిన్ గ్లో రహస్యం..’ మీకు తెలుసా…

టాలీవుడ్ ముద్దు బొమ్మ సమంత తన బ్మూటీ రహస్యం చెప్పేసింది. లాక్ డౌన్ సమయంలోనూ ఇంత అందాన్ని ఎలా కొనసాగిస్తుందో వివరించింది. సోషల్ మీడియాలో..

సమంత స్కిన్ గ్లో రహస్యం.. మీకు తెలుసా...

Updated on: Jul 11, 2020 | 4:00 PM

Samantha Akkineni Spills The Secret Behind Her Glowing : టాలీవుడ్ ముద్దు బొమ్మ సమంత తన బ్మూటీ రహస్యం చెప్పేసింది. లాక్ డౌన్ సమయంలోనూ ఇంత అందాన్ని ఎలా కొనసాగిస్తుందో వివరించింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సామ్… వారు అడిగే ప్రశ్నలకు అదే స్థాయిలో సమాధానం చెబుతుంది. మీ ఫేస్ లో అంత ‘గ్లో’ ఎలా అంటూ కొందరు ఫ్యాన్స్ వేసిన ప్రశ్నలకు ఇంత కాలనికి ఆన్సర్ చేసింది. చెప్పడమే కాదు వీడియో రూపంలో తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

విటమిన్ ఇన్‌ఫ్యూషన్ థెరపీ గురించి ఆ వీడియోలో చెప్పింది. వంట, తోటపనితో మీలో కొంతమందికి బోర్‌ కొట్టి ఉండవచ్చు అంటూ… తాజాగా చర్మ సౌందర్యం, రక్షణ గురించి వివరించింది. స్కిన్‌ గ్లో కోసం ఈ థెరపీ తనకు చాలా ఉపయోగపడిందన్నారు సమంత. అంతేకాదు ‘సమంతా’ కోడ్‌ ద్వారా సదరు ‍ క్లినిక్‌లో 25శాతం తగ్గింపు కూడా లభిస్తుందంటూ ‘బంపర్‌ ఆఫర్‌’ కూడా ఇచ్చారు.

ఇదండి ‘సమంతా స్కిన్ గ్లో సిక్రెట్..’ ఇంకేముంది మీరు కూడా 25 శాతంతో ఫాలో  అవ్వండి..ముందుగా ‘సమంతా స్కిన్ గ్లో సిక్రెట్..’ చూడండి..