Viral Video: ఈ కోడి పుంజు కూత వింటే కుంభకర్ణుడు కూడా ఈజీగా నిద్ర లేస్తాడు.. వామ్మో, రణ ధ్వని

డి కూసిదంటే తెల్లావారింది అనుకుని నిద్ర లేస్తారు. అయితే ఇప్పుడు మీకు చూపించబోయే కోడి కాని మీ ఇంట్లో ఉంది అనుకోండి. మీకు సీన్ సితార అయిపోయినట్లే.

Viral Video: ఈ కోడి పుంజు కూత వింటే కుంభకర్ణుడు కూడా ఈజీగా నిద్ర లేస్తాడు.. వామ్మో, రణ ధ్వని
Rooster Crows

Updated on: Oct 13, 2021 | 6:14 PM

కోడి కూసిదంటే తెల్లావారింది అనుకుని నిద్ర లేస్తారు. అయితే ఇప్పుడు మీకు చూపించబోయే కోడి పుంజు కాని మీ ఇంట్లో ఉంది అనుకోండి. దాని అరుపు విని  మీరు అక్కడి నుంచి పారిపోవడమో, లేక దాన్ని కోసి కూర వండుకోవడమో చేస్తారు. అవును ఈ కోడి పుంజు మాముల్ని కాదు. ఒక్కసారి అరుపు మొదలెట్టింది అంటే ఆపేందుకు నిమిషం సమయం పడుతుంది. ఆ సౌండ్ కంచు మాదిరి వినిపిస్తోంది. అరుపులో వేరియేషన్స్ కూడా చూపిస్తోంది. ఈ కోడి కానీ మీ పరిసర ప్రాంతాల్లో ఉంటే.. మీ చెవుల్లో ఎప్పుడూ దూదులు పెట్టుకోవాల్సిందే. కాస్త అతిశయోక్తి అనుకోకపోతే కుంభకర్ణుడి టైమ్‌లో ఈ కోడి కానీ ఉండి ఉంటే.. ఆయన్ని లేపేందుకు అన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉండకపోయేది. కాగా ఎవరైనా కుంభకర్ణుడి మాదిరి నిద్రపోయే వాళ్లని లేపేందుకు ఈ కోడి ఫర్‌ఫెక్ట్ ఛాయిస్. ఇంత చెబుతున్నారు. వీడియో చూపించరేంటనేగా మీ డౌట్.  ఇంక వెయిట్ చేయించం. క్రేజీగా కూత పెట్టే ఆ కోడి పుంజు వీడియోను దిగువన చూడండి. 

ఈ వీడియోను yournaturegram అనే ఖాతా నుంచి ఇన్ స్టాలో షేర్ చేశారు. దీనికి ఓ రేంజ్‌కు లక్స్, కామెంట్స్ వస్తున్నాయ్. ఇదేం కోడి పుంజురా బాబు అని ఓ వ్యక్తి కామెంట్ పెట్టాడు. ఈ కోడి ఉంటే జిందగీ ఖేల్ ఖతం అని మరొకరు వ్యాఖ్యానించారు. నేనైతో గంటకే దాన్ని కోసి కర్రీ చేసేవాడ్ని అని మరొకరు పేర్కొన్నారు. మొత్తం మీద నెటిజన్లు సదరు వీడియోకు ఫన్నీ కామెంట్లు పెడుతూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.

Also Read: ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన నరేశ్.. సంచలన వ్యాఖ్యలు

కార్పొరేటర్ భర్తను చెప్పుతో చెడామడా వాయించిన మహిళ… ఎందుకో తెలిస్తే షాకే

Loading...
Unable to load recommendations.
Follow Us