UK LockDown:బ్రిటన్ లో రెండు నెలల పాటు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఇది ఫిబ్రవరి వరకు ఉండవచ్చునని, అయితే మరికొంతకాలం పొడిగించినా పొడిగించవచ్ఛునని ఆయన చెప్పారు. స్కూళ్ళు, విద్యాసంస్థలు అన్నీ ఈ రెండు నెలలూ మూసి ఉంటాయన్నారు. ఒక్క ఇంగ్లండ్ లోనే సుమారు 44 మిలియన్ల మంది ఇక ఇళ్లకే పరిమితం కావలసి ఉంటుంది. మంగళవారం అర్ధ రాత్రి నుంచి స్కాట్ లాండ్ లో. బుధవారం నుంచి ఇతర రాష్ట్రాల్లో పూర్తి లాక్ డౌన్ అమల్లో ఉంటుందని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. తాజాగా 27 వేలమంది కరోనా వైరస్ బారిన పడగా. మొన్న ఒక్కరోజే సుమారు 80 వేలమందికి పైగా ఈ వైరస్ పాజిటివ్ కి గురయ్యారని ఆయన చెప్పారు. ఇలా రోజురోజుకీ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో స్ట్రిక్ట్ గా లాక్ డౌన్ విధిస్తున్నామని, అత్యవసరమైన పనులమీద బయటికి వెళ్లాల్సి వస్తేనే ప్రజలు ఇళ్ళు వదలాలని జాన్సన్ పేర్కొన్నారు.
అయితే ఇప్పటికే బ్రిటన్ లో వేలాది మంది లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఘిస్తున్నారు. బయట నిబంధనలకు పాతరేసి క్లబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నారు.వీరిని నియంత్రించడానికి పోలీసులు నానాపాట్లు పడుతున్నారు. కరోనా వైరస్ ఓ బూటకమని ఆసుపత్రుల ముందు నినాదాలు చేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది యువతీయువకులు ఉంటున్నారు.
Video Courtesy: MailOnline