‘ఆశ కలుగుతోంది’, కోవిడ్-19 వ్యాక్సీన్ త్వరలో రావచ్చు,’ ప్రపంచ ఆరోగ్య సంస్థ

కోవిడ్-19 వ్యాక్సీన్ ఈ సంవత్సరాంతంలోగా వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ అద్నామ్ గెబ్రెసెస్ పేర్కొన్నారు. ఇందుకు క్రమంగా ఆశలు తలెత్తుతున్నాయని..

ఆశ కలుగుతోంది, కోవిడ్-19 వ్యాక్సీన్ త్వరలో రావచ్చు, ప్రపంచ ఆరోగ్య సంస్థ

Edited By:

Updated on: Oct 06, 2020 | 8:59 PM

కోవిడ్-19 వ్యాక్సీన్ ఈ సంవత్సరాంతంలోగా వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ అద్నామ్ గెబ్రెసెస్ పేర్కొన్నారు. ఇందుకు క్రమంగా ఆశలు తలెత్తుతున్నాయని ఆయన చెప్పారు. కరోనా వైరస్ పరిస్థితిపై  తమ సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్వహించిన సమీక్షా సమావేశాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇన్నాళ్లకు ఆయన స్వయంగా ఈ విధమైన ప్రకటన చేయడం ఇదే మొదటిసారి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆద్వర్యంలోని తొమ్మిది ప్రయోగాత్మక వ్యాక్సీన్లు దాదాపు అందుబాటులో ఉన్నట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు… వచ్ఛే సంవత్సరాంతానికి 200 కోట్ల డోసుల టీకా మందును ప్రజలకు ఇవ్వగలుగుతామన్న ఆశాభావాన్ని కూడ టెడ్రోస్ వ్యక్తం చేశారు.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us