నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల దెబ్బలు దెబ్బలు తాళలేక మహిళ మృతి చెందిందని గ్రామస్థులు ఆందోళనకు చేపట్టారు. ఉన్సాయిపల్లిలో నాటుసారా అమ్ముతుందన్న ఆరోపణలతో కేతావత్ సక్రి(60) అనే మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ నాగుల మీరా.. సక్రిను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే, స్టేషన్ నుంచి బయటకు వచ్చిన సక్రి తీవ్ర గాయాలతో గ్రామానికి చేరుకుని మృతి చెందింది. అయితే, పోలీసుల దెబ్బలు తాళలేక వృద్ధురాలు మృతిచెందిందని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటనపై మృతురాలి బంధువులు పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. న్యాయం చేయాలంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో భయాందోళన చెందిన పోలీసులు… పోలీస్ స్టేషన్ తలుపులు మూసుకుని పారిపోయారు.