Breaking: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..

తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. సెప్టెంబర్ 9 నుంచి 14వ తేదీ వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష జరుగుతుందని..

Breaking: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..

Updated on: Aug 22, 2020 | 10:48 AM

Telangana Entrance Exams Schedule: తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. సెప్టెంబర్ 9 నుంచి 14వ తేదీ వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష జరుగుతుందని.. అలాగే ఈ నెల 31న ఈసెట్, సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు పీజీ ఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష సెప్టెంబర్ 28,29 తేదీల్లో జరగనుంది.

అటు సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న టీఎస్ ఐసెట్, అక్టోబర్ 1 నుంచి 3వ తేదీ వరకు ఎడ్‌సెట్, అక్టోబర్ 4న లాసెట్‌ పరీక్షలు జరుగుతాయని.. అన్ని పరీక్షలకు కూడా కరోనా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కాగా, కరోనా పాజిటివ్ వచ్చిన స్టూడెంట్స్‌కు ప్రత్యేక పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్..

Loading...
Unable to load recommendations.
Follow Us