Team India South Africa Series: కివీస్ టూర్‌లో టీమిండియా ఘోర పరాజయాలు ఎదుర్కున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం కోహ్లీసేన ఈ నెల 12 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు సన్నద్ధం అవుతోంది. ఈ సిరీస్‌కు తలపడే జట్టును మరికొద్దిరోజుల్లో కొత్త సెలక్షన్ కమిటీ హెడ్ సునీల్ జోషి నేతృత్వంలో ఎంపిక చేయనున్నారు.
ఇదిలా ఉంటే కివీస్ సిరీస్‌లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్‌లలో పూర్తిగా వైఫ్యలం చెందిన సంగతి తెలిసిందే. జట్టులో అందరూ సీనియర్ బౌలర్లలు ఉండటం వల్ల.. సఫారీ సిరీస్‌కు జూనియర్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోందట. అంతేకాకుండా రెగ్యులర్ ఓపెనర్లు శిఖర్ ధావన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మలు ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. అటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కూడా సఫారీ సిరీస్‌కు ముందే సూపర్ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాత్రం సెలెక్టర్లు విశ్రాంతినివ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అతడి స్థానంలో రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. మరి బీసీసీఐ సెలెక్టర్లు ఎవరిని సెలెక్ట్ చేస్తారో.. ఎవరిపై వేటు వేస్తారో చూడాలి.?
For More News:
బాన్సువాడలో దారుణం.. ముగ్గురు కూతుళ్లను హత్య చేసిన తండ్రి..
‘ఎస్ బ్యాంక్’ దెబ్బ.. వినియోగదారులకు షాకిచ్చిన ఫోన్‌పే…
ఆడబిడ్డకు జన్మనిచ్చిన దిశ నిందితుడి భార్య…
మోదీ సర్కార్ సంచలనం.. ఆ రెండు ఛానళ్లపై నిషేధం…
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. నోటిఫికేషన్ విడుదల
బిగ్ బ్రేకింగ్: ఏపీలో పదో తరగతి పరీక్షలకు కొత్త షెడ్యూల్
తిరుమలలో అపచారం.. వెంకన్న సాక్షిగా వాళ్లు ఏం చేశారంటే..?
విజయ్ దేవరకొండ హీరోయిన్ ఎగ్ దోశలు.. వీడియో వైరల్..
హైపర్ ఆది సంచలన నిర్ణయం.. జబర్దస్త్ నుంచి దొరబాబు, పరదేశీలు.?