ఆ మ్యాచ్ టీమిండియా కావాలనే ఓడిపోయింది..!

2019 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ వెర్సెస్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కావాలనే ఓడిపోయిందని పాక్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ వెల్లడించారు. భారత్‌తో జరిగిన మ్యాచ్ గురించి ప్రస్తావిస్తూ బెన్ స్టోక్స్ తన ‘ఆన్‌పైర్‌’ పుస్తకంలో పలు విషయాలను ప్రస్తావించగా.. అది ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరలేపింది. దీనిపై వరుసగా పాక్ మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మొన్నటికి మొన్న పాకిస్తాన్‌ మాజీ బౌలర్‌ సికిందర్‌ బక్త్‌ టీమిండియాపై ఆరోపణలు చేయగా… తాజాగా రజాక్ కూడా […]

ఆ మ్యాచ్ టీమిండియా కావాలనే ఓడిపోయింది..!
Follow us

|

Updated on: Jun 04, 2020 | 2:11 PM

2019 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ వెర్సెస్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కావాలనే ఓడిపోయిందని పాక్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ వెల్లడించారు. భారత్‌తో జరిగిన మ్యాచ్ గురించి ప్రస్తావిస్తూ బెన్ స్టోక్స్ తన ‘ఆన్‌పైర్‌’ పుస్తకంలో పలు విషయాలను ప్రస్తావించగా.. అది ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరలేపింది.

దీనిపై వరుసగా పాక్ మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మొన్నటికి మొన్న పాకిస్తాన్‌ మాజీ బౌలర్‌ సికిందర్‌ బక్త్‌ టీమిండియాపై ఆరోపణలు చేయగా… తాజాగా రజాక్ కూడా ఇదే వరుసలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్‌ లీగ్ మ్యాచ్‌లలో వరుసగా విజయాలు సాధించిన జట్టు.. ఇంగ్లాండ్‌పై ఎందుకు ఓడిపోయింది.? వరల్డ్ బెస్ట్ బౌలర్.. ఎందుకు ఈ మ్యాచ్‌లోనే లయ తప్పి పరుగులు సమర్పించుకున్నాడు. ఫోర్లు, సిక్స్‌లు కొట్టాల్సిన సమయంలో ఎందుకు డిఫెన్సు ఆడారు.? ఇవన్నీ కూడా ఒక జట్టును క్వాలిఫై కాకుండా చేసేందుకే భారత్ చేసిందని.. అందుకే ఆ మ్యాచ్ ఓడిపోయిందని రజాక్ విమర్శించాడు.

అటు పాకిస్తాన్ మాజీ స్పిన్నర్‌ ముస్తాక్‌ అహ్మద్‌ కూడా ఈ విషయంపై మాట్లాడుతూ.. పాకిస్తాన్‌ నాకౌట్‌కు చేరకుండా ఉండేందుకే భారత్ ఆ మ్యాచ్ ఓడిపోయినట్లు తనకు జేసన్‌ హోల్డర్‌, క్రిస్‌ గేల్‌, ఆండ్రీ రసెల్‌ లాంటి విండీస్ క్రికెటర్లు చెప్పారని ముస్తాక్‌ అహ్మద్‌ వివరించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో తాను విండీస్‌ క్రికెట్‌తో పని చేసినప్పుడు వారు ఈ విషయాన్ని వెల్లడించారని చెప్పాడు. ఏది ఏమైనా పాకిస్తాన్ క్రికెటర్లకు భారత్ ఆటగాళ్ళపై తన అక్కసును వెళ్లబుచ్చుకోవడం ఇదేం కొత్త కాదు.

Also Read:

నార్త్ కొరియాలో యుద్ధ మేఘాలు.. కిమ్ ఆదేశమే లేటు..!

ఏపీలో కొన్ని స్టేషన్లలోనే ఆగనున్న రైళ్లు.. వారికి డబ్బులు రీఫండ్..

వైఎస్ఆర్ వాహనమిత్ర.. వారి ఖాతాల్లోకి రూ.10 వేలు జమ..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై భూములకు ‘భూధార్’..

అప్పటివరకు సిటీ బస్సు సర్వీసులు లేనట్లే..!

Latest Articles
ఆప్షన్ లేదు నీకు అర్థమైంది నాకు.! అన్నట్టే చేస్తున్న కృతి శెట్టి.
ఆప్షన్ లేదు నీకు అర్థమైంది నాకు.! అన్నట్టే చేస్తున్న కృతి శెట్టి.
గుర్తుపట్టారా ఈ పాప ఎవరో.. ఇప్పుడు అబ్బాయిల కలలరాణి
గుర్తుపట్టారా ఈ పాప ఎవరో.. ఇప్పుడు అబ్బాయిల కలలరాణి
రావల్పిండిలో భారత్, పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్.. ఐసీసీ గ్రీన్ సిగ్నల్
రావల్పిండిలో భారత్, పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్.. ఐసీసీ గ్రీన్ సిగ్నల్
అధిక మైలేజీ.. అతి తక్కువ ధర.. రూ. 10 లక్షలలోపు టాప్ కార్లు ఇవే..
అధిక మైలేజీ.. అతి తక్కువ ధర.. రూ. 10 లక్షలలోపు టాప్ కార్లు ఇవే..
జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీపై నార్త్‌లో డిస్కషన్.. ఎందుకలా..?
జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీపై నార్త్‌లో డిస్కషన్.. ఎందుకలా..?
ఆ సముద్రగర్భంలో కోట్ల సంపద గుర్తింపు .. పొందితే కుబేరులు అయినట్టే
ఆ సముద్రగర్భంలో కోట్ల సంపద గుర్తింపు .. పొందితే కుబేరులు అయినట్టే
ముఖేష్ అంబానీకి 61 వేల కోట్లకు పైగా లాభం.. ఎలా వచ్చిందో తెలుసా?
ముఖేష్ అంబానీకి 61 వేల కోట్లకు పైగా లాభం.. ఎలా వచ్చిందో తెలుసా?
జుట్టు రాలడానికి ఇది కూడా ఓ కారణమే.. ఈ సింపుల్‌ టిప్స్ పాటించండి
జుట్టు రాలడానికి ఇది కూడా ఓ కారణమే.. ఈ సింపుల్‌ టిప్స్ పాటించండి
వాట్సాప్ యూజర్లకు ఇక పండగే.. ఒకే ఖాతాకు నాలుగు డివైజ్‌ల లింక్..
వాట్సాప్ యూజర్లకు ఇక పండగే.. ఒకే ఖాతాకు నాలుగు డివైజ్‌ల లింక్..
భోజన ప్రియులను భయపెడుతున్న రెస్టారెంట్‌ ఫుడ్..!
భోజన ప్రియులను భయపెడుతున్న రెస్టారెంట్‌ ఫుడ్..!